iDreamPost

కరీంనగర్ BJP MP టికెట్ ఎవరికి? రేసులో ఉదయనందన్ రెడ్డి, బండి సంజయ్!

Karim Nagar: 2023 డిసెంబర్ లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇక అన్ని పార్టీలు పార్లమెంట్ ఎన్నికలపై దృష్టిసారించాయి. ఈ నేపథ్యంలోనే మరోసారి అత్యధిక స్థానాలు గెలుపే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది.

Karim Nagar: 2023 డిసెంబర్ లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇక అన్ని పార్టీలు పార్లమెంట్ ఎన్నికలపై దృష్టిసారించాయి. ఈ నేపథ్యంలోనే మరోసారి అత్యధిక స్థానాలు గెలుపే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది.

కరీంనగర్ BJP MP టికెట్ ఎవరికి? రేసులో ఉదయనందన్ రెడ్డి, బండి సంజయ్!

ఇటీవలే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. దాదాపు పదేళ్ల తరువాత ఇక్కడ అధికారం మారింది. పదేళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా..  తాజాగా ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి..కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇదే సమయంలో బీజేపీకి తెలంగాణలో ఫలితాలు ఊహించని షాకిచ్చాయి. ఆ పార్టీ ఎన్నో ఆశలు పెట్టుకుంటే.. కేవలం 8 సీట్లకు మాత్రమే పరితమైంది. అయితే మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో మాదిరిగా ఈసారి మరిన్ని లోక్ సభ స్థానాలను సాధించే దిశగా బీజేపీ వ్యూహాలు రచిస్తుంది.

2019 పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి  నాలుగు స్థానాలు దక్కాయి. దీంతో బీజేపీకి తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వచ్చింది. ఆ సమయంలో నిజామాబాద్, కరీంనగర్, అదిలాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాలను బీజేపీ గెల్చుకుంది. అయితే తాజాగా గతానికి మించి మరిన్ని స్థానాల్లో కాషాయం జెండ ఎగరాలని బీజేపీ భావిస్తుంది. ఈక్రమంలో లోక్ సభ ఎన్నికలకు, నియోజకవర్గాలలో చేసే సర్వేల ఆధారంగా అధిష్టానం ఎంపీ అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. ఈనేపథ్యంలో కరీనంగర్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి ఓ ఆసక్తిరమైన విషయం వైరల్ అవుతోంది. ప్రస్తుత పరిస్థితులను కరీంనగర్ నుంచి చూస్తే బండి సంజయ్ లేదా వీణవంకకు చెందిన ఉదయనందన్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో క‌రీంన‌గ‌ర్‌ జిల్లాలో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదు. బండి సంజ‌య్ ఇచ్చిన రికమెండేషన్స్ తోనే బీజేపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎక్కువ మంది అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించిందని టాక్. కరీంనగర్లో తప్ప బండి సంజ‌య్ మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో ప్రచారం చేయకపోవటంతో ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉందని పొలిటికల్ సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది. అదీ కాక.. అసెంబ్లీ ఎన్నికలలో కూడా కరీంనగర్ జిల్లాలో బీజేపీ ఘోరంగా ఓటమి పాలైంది. కానీ వ‌చ్చే లోక్‌సభ ఎన్నికల కోసం నియోజకవర్గాల వారిగా కసరత్తు చేయాలని భావిస్తుంది అధిష్టానం.

సిరిసిల్ల లాంటి అసెంబ్లీ నియోజికవర్గంలో స్ధానిక లీడర్ అయిన పద్మశాలి కులస్తులకి టికెట్ ఇచ్చి ఉండాలి. కానీ అలా కాకుండా ఎక్కడినుండో వచ్చిన నాన్ లోకల్ వ్యక్తికి టిక్కెట్ ఇవ్వడంతో అక్కడ పార్టీ తీవ్రంగా నష్టపోయింది. అలాగే వేములవాడలో బీసీ-గొల్ల కుర్మ సామాజికవర్గానికి చెందిన తుల ఉమకు టికెట్ ఇవ్వాల్సి ఉండగా….చివరి నిమిషంలో మార్చి వేరే వ్యక్తికి ఇచ్చారు. ఈ నిర్ణయం వల్ల తుల ఉమ మద్దతుదారులు, గొల్ల కుర్మ సామాజికవర్గం పార్టీకి వ్యతిరేకం అవ్వడంతో బీజేపీ అక్కడ ఓడిపోవడం జరిగింది. మరోవైపు ఈటల, బండి సంజయ్‌ల మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ నడుస్తోందని టాక్ వినిపిస్తోంది. అదే బీజేపీ కి పెద్ద సమస్యగా మారిందంట.

ఈ నేపథ్యంలోనే కరీంనగర్‌లో పెద్ద సంఖ్యలో ఉన్న రెడ్డి సామాజికవర్గ ప్రజలు, అదే వర్గానికి చెందిన వ్యక్తినే కరీంనగర్‌ బీజేపీ ఎంపీ అభ్యర్దిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బండి సంజయ్ గెలవడం చాలా కష్టం. ఇక ఈ పరిస్థితిని చక్కదిద్దే పనిలో పడింది బీజేపీ అధిష్టానం. కరీంనగర్ లో ఉన్న కుల సమీకరణలు, అధికార వ్యతిరేక లాంటి ప్రస్తుత పరిస్థితులను అంచనా వేసి, మంచి క్లీన్ ఇమేజ్ ఉండి, గెలిచే అభ్యర్థిని ఎంపిక చెయ్యడం కోసం సర్వేలు చేయిస్తుంది. ఈ క్రమంలోనే పాడి ఉదయనందన్ రెడ్డి పేరు వార్తల్లోకి వచ్చింది. ఆయన కూడా కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

పాడి ఉదయనందన్ రెడ్డి సిమెన్స్‌లో చిన్న ఇంజనీర్‌గా మొదలు పెట్టి..అదే సిమెన్స్‌లోని సంస్థలో ఎంతో గొప్ప స్థానానికి ఎదిగాడు. ఆయన దేశంలోని ఓటీటీ వీడియో ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో తను ఏంటో నిరూపించుకున్నాడు. అంతేకాకుండా పాడి ఉదయనందన్ రెడ్డి బలమైన రాజకీయ కుటుంబం నుంచి వచ్చాడు. ఆయన తాత స్వర్గీయ శ్రీ పాడి సుధాకర్ రెడ్డి. ఇలాంటి మంచి క్లీన్ ఇమేజ్ ఉన్న యువకులే తెలంగాణలో బీజేపీ ప్రతిష్టను పెంచుతారని అధిష్టానం భావిస్తుందట. పాడి ఉదయనందన్ రెడ్డి ఆర్‌ఎస్‌ఎస్ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి అని కూడా తెలుస్తోంది.

తన కుటుంబం అందరూ ఏబీవీపీ నుండి వచ్చారు. వారి కుటుంబం సనాతన ధర్మాన్ని బలంగా నమ్ముతుంది. వెయ్యి సంవత్సరాల చరిత్రగల వెంకటేశ్వర ఆలయాన్ని వారే చూసుకుంటున్నారు. అంతేకాక సమ్మక సారలమ్మ జాతరను కూడా వారే నిర్వహిస్తున్నారు. ఇవన్నీ అంశాలను పరిగణలోకి తీసుకుని ఒక మంచి క్లీన్ ఇమేజ్ ఉన్న కొత్త అభ్యర్ధికి టికెట్ ఇవ్వడం మంచిదని అందరూ భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో, పాడి ఉదయనందన్ రెడ్డి  పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూస్తే, బీజేపీలో కొత్త అభ్యర్ధులే ఎక్కువ మంది గెలిచారు.

స్టార్ క్యాంపెయినర్ కావడంతో తనకున్న ఇమేజ్ దృష్ట్యా,  గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న జహీరాబాద్ నుంచి బండి సంజయ్ ని ఎంపీగా బరిలోకి దింపాలని బీజేపీ చూస్తోంది.  కరీంనగర్ లో కాంగ్రెస్ రెడ్డి అభ్యర్థిని బరిలోకి దింపితే బండి సంజయ్ గెలవడం కష్టమని, అలాగే కరీంనగర్‌లో ఉన్న కుల సమీకరణాల దృష్ట్యా బండి జహీరాబాద్ నుంచి పోటీచేయడం మంచిదని బీజేపీ ఆలోచిస్తుందని సమాచారం. దీనితో కరీంనగర్, జహీరాబాద్ రెండు సీట్లు తమ పార్టీ గెల్లవొచ్చుని  బీజేపీ అంచనా వేస్తోంది అంటా. మరి..కరీంనగర్ విషయంలో బీజేపీ ఆలోచిస్తున్న విధానంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి