iDreamPost

OTTలో హీట్ పుట్టించే మూవీ..! భర్త పోలీస్.. ప్రియుడు స్టూడెంట్!

OTT Suggestions: ఓటీటీలో ఎన్నో సినిమాలు చూసుంటారు. కానీ, కొన్ని చిత్రాలను మాత్రం స్టార్ కాస్ట్ లేదనే ఉద్దేశంతో లైట్ తీసుకుంటారు. కానీ, ఈ మూవీని ఒకసారి చూస్తే.. మంచి రొమాంటిక్ కామెడీ డ్రామా చూశామనే ఫీలింగ్ కలుగుతుంది.

OTT Suggestions: ఓటీటీలో ఎన్నో సినిమాలు చూసుంటారు. కానీ, కొన్ని చిత్రాలను మాత్రం స్టార్ కాస్ట్ లేదనే ఉద్దేశంతో లైట్ తీసుకుంటారు. కానీ, ఈ మూవీని ఒకసారి చూస్తే.. మంచి రొమాంటిక్ కామెడీ డ్రామా చూశామనే ఫీలింగ్ కలుగుతుంది.

OTTలో హీట్ పుట్టించే మూవీ..! భర్త పోలీస్.. ప్రియుడు స్టూడెంట్!

ఓటీటీలో ఎన్నో అద్భుతమైన సినిమాలు, వెబ్ సిరీస్లు ఉంటాయి. కానీ, కొన్ని మాత్రం భలే గుర్తుండిపోతాయి. అరె ఇలాంటి సినిమా మనం ఎలా మిస్ అయ్యాం? అనే ఒక భావన కలుగుతుంది. అలాంటి మూవీస్ లో రొమాంటిక్ కామెడీ డ్రామాలు కూడా ఉంటాయి. అయితే వాటిలో కూడా మంచి మెసేజ్ ఉంటుంది. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే. ఇది మంచి రొమాంటిక్ కామెడీ డ్రామా. ఇందులో ఫన్ కూడా అలాగే ఉంటుంది. అక్కడ ఇన్ టెన్స్ సీన్ నడుస్తూ ఉంటే మీరు మాత్రం అది చూసి నవ్వుకుంటూ ఉంటారు. ఓటీటీలో తెలుగులో ఉన్న ఈ మూవీని చాలాకాలంగా ఎంతో మంది లైట్ తీసుకున్నారు.

ఓటీటీ సజీషన్స్ లో ఈసారి మీకోసం ఒక మంచి రొమాంటిక్ కామెడీ డ్రామా తీసుకొచ్చాం. ఈ మూవీ గురించి మీరు వినే ఉంటారు. ఈ చిత్రం ట్రైలర్ కూడా చూసే ఉండచ్చు. కానీ, మూవీ మాత్రం చూసుండరు. ఎందుకంటే ఈ మూవీలో చెప్పుకోదగ్గ స్టార్స్ లేరు. అందుకే మీరు ఈ చిత్రాన్ని లైట్ తీసుకుని ఉంటారు. కానీ, ఇది తప్పకుండా చూడాల్సిన రొమాంటిక్ కామెడీ డ్రామా. నిజాని ఇందులో మంచి మెసేజ్ కూడా ఉంది. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చూడాల్సిన సినిమా ఇది. ఆ మూవీ మరేదో కాదు.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ఉన్న షికారు అనే చిత్రం. ఈ మూవీ చూసిన తర్వాత ఒక మంచి రొమాంటిక్ కామెడీ మెసేజ్ ఓరియెంటెడ్ డ్రామా చూశామనే ఫీలింగ్ అయితే కలుగుతుంది.

ఈ మూవీలో ప్రతి యాక్టర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా హీరోయిన్ సాయి ధన్సిక్ మూవీ మొత్తాన్ని ఒంటి చేత్తో పుల్ చేసింది. ఆమె నటనకు ఫ్యాన్స్ ఫిదా కావాల్సిందే. భర్త ఇంట్లో లేనప్పుడు దేవికా అనే గృహిణి స్టూడెంట్ ప్రియుడిని ఇంటికి పిలుస్తుంది. అయితే తన భర్త రొమాంటికో కాదో తెలుసుకునేందుకు ఈ కుర్రాడిని రమ్మంటుంది. అయితే తాను చేస్తోంది ఎంత తప్పో కూడా తనకి తెలియదు. ఏదో యాంగ్జైటీలో పరిచయమైన ఒక్కరోజుకే కుర్రాడిని ఇంటికి రమ్మని పిలుస్తుంది.

దేవికా సంసార జీవితంలో తన భర్తతో సంతృప్తిగా లేకపోవడమే కారణం. అదే విషయంపై భర్తతో మాట్లాడాలి అనుకుంటుంది. ఈలోపే ఈ కుర్రాడి రూపంలో తన లైఫ్ పరుగులు పెడుతుంది. నిజానికి హీరోయిన్ కు తప్పు చేయాలి అనే ఉద్దేశం ఉండదు. కానీ, భర్తతో రోజూ టార్చర్ గా అనిపించడం, సంసారం కూడా సుఖంగా లేకపోవడంతో తన బుద్ధి పక్కదారి పడుతుంది. అయితే ఆమె కుర్రాడితో తప్పు చేసిందా? అసలు భర్త ఇంట్లో నుంచి వెళ్లిన వాడు సడెన్ గా ఎందుకు వచ్చాడు? ఆ తర్వాత ఏమైంది? భార్యను వేరే కుర్రాడితో భర్త పట్టుకున్నాడా? అసలు ఆమె లైఫ్ ఎన్ని మలుపులు తిరిగింది అనేదే షికారు సినిమా.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి