iDreamPost

భర్త గురకతో భార్య పడే కష్టం.. OTTలో జంటగా చూడాల్సిన సినిమా ఇది!

OTT Suggestions: ఓటీటీలో ఎన్ని యాక్షన్ చిత్రాలు ఉన్నా.. ఒక మంచి ఫ్యామిలీ డ్రామా చూడకపోతే ఏమీ తోచదు అనుకునేవాళ్లు ఉంటారు. అలాంటి వారి కోసం ఒక అద్భుతమైన కామెడీ డ్రామా ఓటీటీలో అందుబాటులో ఉంది.

OTT Suggestions: ఓటీటీలో ఎన్ని యాక్షన్ చిత్రాలు ఉన్నా.. ఒక మంచి ఫ్యామిలీ డ్రామా చూడకపోతే ఏమీ తోచదు అనుకునేవాళ్లు ఉంటారు. అలాంటి వారి కోసం ఒక అద్భుతమైన కామెడీ డ్రామా ఓటీటీలో అందుబాటులో ఉంది.

భర్త గురకతో భార్య పడే కష్టం.. OTTలో జంటగా చూడాల్సిన సినిమా ఇది!

సినిమాలు చూడటం అనేది ఎంతో మందికి ఒక బలహీనత అనే చెప్పాలి. కొన్ని సినిమాలు వావ్ ఏముంది అనే అభిప్రాయాన్ని కలిగిస్తుంది. ఇంకొన్ని సినిమాలు అరె అచ్చం మన లైఫ్ లో నుంచి తీసుకున్న పాయింట్ లా ఉందే అనే భావన కలుగుతుంది. నిజానికి ఇండస్ట్రీలో వచ్చే ఎన్నో సినిమాలు రియల్ లైఫ్ పాయింట్స్ మీదే వస్తుంటాయి. కాకపోతే అన్నీ బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీస్ అని చెప్పరు. వాటిని చూడగానే మనకే అర్థమైపోతుంది. ఇదేదో మనకి సంబంధించిందే అని. అలాంటి ఒక సినిమానే ఇది కూడా. ఈ మూవీ మొత్తం రియల్ లైఫ్ లో మనం చూసేది, మనం వినేది, మనకి జరిగే పాయింట్ మీదే తెరకెక్కించారు. ఈ మూవీ ఓటీటీలో కూడా అందుబాటులో ఉంది.

ఇప్పుడు చెప్పుకుంటోంది గుడ్ నైట్ అనే సినిమా గురించి. ఇది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది. ఈ మూవీలో హీరోగా చేసింది ఎవరో కాదు.. ట్రూ లవర్ అని తెలుగులో ఒక డబ్బింగ్ సినిమా హిట్టు కొట్టింది కదా.. ఆ హీరో మణికందన్ ట్రూ లవర్ కంటే ముందే తీసిన సినిమా ఇది. ఈ మూవీ చూస్తున్నంత సేపు ఆడియన్స్ తమని తాము రిలేట్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే అందరూ కాకపోయినా కొందరి ఇంట్లో మాత్రం ఈ సమస్య ఉంటూనే ఉటుంది. అదే గురక సమస్య. అవునండి గురక సమస్య మీదే ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ మూవీలో హీరోకి గురక పెట్టే సమస్య ఉంటుంది.

గురకపెట్టడం అంత పెద్ద సమస్య ఏమీ కాదు అని తీసిపారేయకండి. ఎందుకంటే ఆ బాధ అనుభవించే వారికే తెలుస్తుంది. అయితే ఎంతో ఇష్టపడి హీరోని పెళ్లి చేసుకున్న హీరోయిన్ కి అప్పటి వరకు అంతా బాగానే ఉంటుంది. కానీ, రాత్రి కాగానే సింహం గుహలో నిద్రపోతున్న ఫీలింగ్ వస్తుంది. హీరో పెట్టే గురకకి ఆమెకు రాత్రి నిద్ర ఉండదు. ఈ గురక సమస్యతో భార్య ఎన్ని కష్టాలు పడింది? ఆ గురక సమస్యను అధిగమించడానికి హీరో ఎన్ని కష్టాలు పడ్డాడు? అసలు గురక వల్ల విడాకులు దాకా వెళ్తారా? అనే విషయాలను ఎంతో బాగా తెరకెక్కించారు. ఎంతో సున్నితమైన సమస్యను అందరికీ తెలిసిన సమస్యను హ్యాండిల్ చేయడంలో.. అది కూడా ఫన్నీ వేలో చూపించడంలో వినాయక్ చంద్రశేఖరన్ నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యాడు.

తాజాగా డియర్ అనే సినిమా ట్రైలర్ విడుదలైంది. అది కూడా సేమ్ టూ సేమ్ ఇదే తరహా సమస్యపై నిర్మించింది. కాకపోతే గుడ్ నైట్ సినిమాలో అబ్బాయి గురకపెడుతూ ఉంటాడు. కానీ, డియర్ సినిమాలో భార్య గురక పెడుతూ ఉంటుంది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత అచ్చం గుడ్ నైట్ సినిమా చూసినట్లే ఉందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మూవీ ఏప్రిల్ 11న విడుదల కాబోతోంది. ఈలోపు మీరు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఉన్న గుడ్ నైట్ మూవీని చూసేస్తే.. డియర్ మూవీని కూడా బాగా ఎంజాయ్ చేయచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. మీ పార్టనర్ తో కలిసి ఈ గుడ్ నైట్ చిత్రాన్ని ఓటీటీలో చూసేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి