iDreamPost

Theatres And OTT థియేటర్ కు ధీటుగా విడుదలైన డిజిటిల్ వినోదం

Theatres And OTT థియేటర్ కు ధీటుగా విడుదలైన  డిజిటిల్ వినోదం

గత నెల 5న థియేటర్లలో భారీగా విడుదలైన బాలీవుడ్ మల్టీ స్టారర్ ‘సూర్యవంశీ’ నిన్న అర్ధరాత్రి నుంచే నెట్ ఫ్లిక్స్ లో ఓటిటి ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. నెల కూడా పూర్తి కాకుండానే డిజిటల్ కు ఇచ్చేశారు. ముందు రెండు నెలలు లేదా యాభై రోజుల తర్వాత స్ట్రీమింగ్ ఉంటుందన్నారు కానీ అనూహ్యంగా నిర్ణయం మార్చుకోవడం విశేషం. దీనికి హంగామా చేయకుండా కేవలం కొద్దిగంటల ముందే డేట్ ని రివీల్ చేయడం గమనార్హం. మరో ట్విస్ట్ ఏంటంటే తెలుగుతో సహా మరో అయిదు భాషల్లో డబ్బింగ్ చేయడం. ఇది కేవలం ఓటిటి వెర్షన్లకు మాత్రమే జరిగింది. ఒరిజినల్ మాత్రం సినిమా హాళ్లలో హిందీ మాత్రమే వచ్చింది.

ఇక ఇవాళ డిజిటల్ ఎంటర్ టైన్మెంట్ గట్టిగానే అందింది. అభిషేక్ బచ్చన్ కిల్లర్ స్టోరీ ‘బాబ్ బిస్వాస్’ జీ5 ద్వారా విడుదల చేశారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ థ్రిల్లర్ మీద బచ్చన్ గట్టి నమ్మకమే పెట్టుకున్నాడు. హిందీ సూపర్ హిట్ వెబ్ సిరీస్ ‘ఇన్ సైడ్ ఎడ్జ్ సీజన్ 3’ రాత్రి నుంచి అందుబాటులోకి వచ్చింది. ఇది తెలుగు ఆడియోలోనూ ఉంది. నెట్ ఫ్లిక్స్ బ్లాక్ బస్టర్ సిరీస్ ‘మనీ హీస్ట్ సీజన్ 5’ చివరి భాగాలు మధ్యాన్నం 1.30 నుంచి ప్రసారం చేయబోతున్నారు. కన్నడ చిత్రం ‘ఫుక్సట్టే లైఫ్’ని జీ5లో రిలీజ్ చేశారు. సాయిపల్లవి చెల్లెలు పూజా కన్నన్ తెరంగేట్రం చేసిన ‘చితిరై సీవనం’ సోనీ లివ్ లో తెలుగులో వచ్చేసింది

ఇక మన సినిమాల సంగతి చూస్తే మారుతీ ‘మంచి రోజులు వచ్చాయి’ ఆహాలో వచ్చేసింది. థియేటర్ లో గొప్పగా ఆడలేదు కానీ ఓటిటి ద్వారా గట్టిగా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇదే ప్లాట్ ఫార్మ్ లో ఇవాళ బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్’లో భాగంగా బ్రహ్మానందం, దర్శకుడు అనిల్ రావిపూడి ఎపిసోడ్ స్ట్రీమ్ అవుతుంది. ప్రోమోలు ఇప్పటికే అంచనాలు పెంచేశాయి. ఇవి కాకుండా మరికొన్ని హాలీవుడ్ సినిమాలు సిరీస్ లు కూడా చిన్నితెరను పలకరించాయి. ‘డ్యూన్’ని పే మోడల్ లో తీసుకొచ్చారు. సో అఖండని మిస్ అయినవాళ్లు ఇల్లు కదలకుండానే ఎంజాయ్ చేసే వినోదం బోలెడు ఆప్షన్లతో స్మార్ట్ స్క్రీన్ పై ఈ రోజు చాలానే వచ్చింది.

Also Read : Pushpa : టార్గెట్ ని బన్నీ ఈజీగానే చేరుకోవచ్చు కానీ …

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి