iDreamPost

సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నటుడు మృతి

సినీ ఇండస్ట్రీలో విషాదాల పర్వం కొనసాగుతుంది.. ప్రముఖ నటీనటులు వరుసగా కన్నుమూస్తున్నారు. ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది

సినీ ఇండస్ట్రీలో విషాదాల పర్వం కొనసాగుతుంది.. ప్రముఖ నటీనటులు వరుసగా కన్నుమూస్తున్నారు. ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది

సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నటుడు మృతి

ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత ఏడాది పలు ఇండస్ట్రీలో ప్రముఖులు కన్నుమూసిన విషయం తెలిసిందే. తమ అభిమాన నటీనటులు కన్నుమూయడంతో వారి కుటుంబ సబ్యులు మాత్రమే కాదు.. వారిని అభిమానించే అభిమానులు దుఖఃసాగరంలో మునిగిపోతున్నారు. వయోభారం, అనారోగ్య సమస్యలు, రోడ్డు ప్రమాదాల.. ఇలా పలు కారణాల వల్ల సెలబ్రెటీలు కన్నుమూస్తున్నారు. హాలీవుడ్ లో వరుస విషాదాలు అభిమానుల మనసు కలచి వేస్తున్నాయి. ప్రముఖ నటి చితా రివేరా, ప్రిడేటర్ ఫేమ్ ప్రముఖ నటుడు కార్ల్ వెదర్స్ కన్నుమూసిన విషాదం నుంచి కోలుకోకముందే మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే..

హాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు బస్ స్టాప్, నాట్స్ ల్యాండింగ్ చిత్రాల ఫేమ్ డాన్ ముర్రే (94) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని.. వయోభారంతో కన్నుమూశారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. 1929, జులై 31 న లాస్ ఏంజెల్స్ లో డాన్ ముర్రే జన్మించారు. డొనాల్డ్ పాట్రిక్ ముర్రే 1951 లో తెరకెక్కించిన ‘ది రోజ్ టటూ’ మూవీతో బాలనటుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. 1956 డాన్ ముర్రే నటించిన చిత్రం ‘బస్ స్టాప్‌’లో కౌబాయ్‌గా నటించినందుకు ఆస్కార్ నామినేషన్ పొందాడు. ఒకప్పటి హాలీవుడ్ ఎవర్ గ్రీన్ బ్యూటీ మార్లిన్ మన్రో ఈ మూవీలో హీరోయిన్ గా నటించింది.

ది స్కిన్ ఆఫ్ అవర్ టీత్, ఎ హాట్‌ఫుల్ ఆఫ్ రెయిన్, షేక్ హ్యాండ్స్ విత్ ది డెవిల్, ది హూడ్లం ప్రీస్ట్ తో పాటు దాదాపు 35 చిత్రాల్లో నటించారు. నటుడిగానే కాకుండా రచన, దర్శకత్వం, నిర్మాణ రంగాల్లో కూడా తనదైన ముద్ర వేశారు. డాన్ ముర్రే మరణ వార్త తో హాలీవుడ్ ఇండస్ట్రీ లో తీవ్ర విషాదం నెలకొంది. ఇప్పటికీ హాలీవుడ్ లో అభిమానలు ఆయనను కౌబాయ్ గానే చూస్తుంటారు. ఆయన మృతి పట్ల పలువురు హాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి