iDreamPost

డిగ్రీ పాసయ్యారా?.. TTDలో ఈ ఉద్యోగాలు మీకోసమే.. నెలకు లక్షన్నర వరకు జీతం

డిగ్రీ పూర్తై ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూసే నిరుద్యోగులకు భారీ శుభవార్త. టీటీడీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. లక్షన్నర వరకు జీతం అందుకోవచ్చు.

డిగ్రీ పూర్తై ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూసే నిరుద్యోగులకు భారీ శుభవార్త. టీటీడీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. లక్షన్నర వరకు జీతం అందుకోవచ్చు.

డిగ్రీ పాసయ్యారా?.. TTDలో ఈ ఉద్యోగాలు మీకోసమే.. నెలకు లక్షన్నర వరకు జీతం

ఆంధ్రప్రదేశ్ లోని యువతకు గుడ్ న్యూస్. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి జీవితంలో స్థిరపడాలనుకునే వారికి ఇదే మంచి సమయం. ఇప్పటికే పలు ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు రిలీజ్ కాగా వాటికి సంబంధించిన భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పుడు ఏపీలోని నిరుద్యోగులకు మరో శుభవార్త. టీటీడీ కాలేజీల్లో లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. శాశ్వత ప్రాతిపదికన డిగ్రీ కాలేజీలు/ ఓరియంటల్ కాలేజీల్లో డిగ్రీ లెక్చరర్లు, టీటీడీ జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 49 డిగ్రీ లెక్చరర్ పోస్టుల, 29 జూనియర్ లెక్చరర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, హిందూ రిలీజియన్ కు చెందిన వారై ఉండాలి. డిగ్రీ పాసైన వారు, నెట్/స్లెట్ క్వాలిఫై అయిన వారు అప్లై చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మార్చి 7 నుంచి 27వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. లక్షన్నర వరకు జీతం అందుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం కోసం టీటీడీ అధికారిక వెబ్ సైట్ ను https://tirumala.org/ పరిశీలించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన సమాచారం:

డిగ్రీ లెక్చరర్ పోస్టులు:

  • 49

అర్హత:

  • అభ్యర్థులు కనీసం 55% మార్కులతో సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత, నెట్‌/ స్లెట్‌ అర్హత సాధించి ఉండాలి.

జూనియర్ లెక్చరర్ పోస్టులు:

  • 29

అర్హత:

  • కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:

  • 1.07.2023 నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆయా కేటగిరీ వర్గాల వారికి వయోసడలింపు నిబంధనలు వర్తిస్తాయి.

దరఖాస్తు ఫీజు:

  • రూ.370. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్ మెన్ అభ్యర్థులకు రూ.250 చెల్లించాలి.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌ లైన్

ఎంపిక విధానం:

  • రాత పరీక్ష(సీబీటీ), సర్టిఫికేట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

జీతం:

  • డిగ్రీ లెక్చరర్‌ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ.61,960- రూ.1,51,370 అందిస్తారు.
  • జూనియర్ లెక్చరర్‌ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ.57,100- రూ.1,47,760 చెల్లిస్తారు.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:

  • 07-03-2024

దరఖాస్తుకు చివరితేదీ:

  • 27-03-2024

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి