iDreamPost

APలో జూనియర్ అసిస్టెంట్ Jobs..నెలకు రూ.80 వేల వరకు జీతం

మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీకు ఇదొక శుభవార్త. ఏపీలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ పాసైన వాళ్లు అప్లై చేసుకోవచ్చు.

మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీకు ఇదొక శుభవార్త. ఏపీలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ పాసైన వాళ్లు అప్లై చేసుకోవచ్చు.

APలో జూనియర్ అసిస్టెంట్ Jobs..నెలకు రూ.80 వేల వరకు జీతం

మీరు డిగ్రీ పూర్తి చేసుకుని ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా? ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా? అయితే మీకు భారీ శుభవార్త. ఏపీలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 80 వేల వరకు జీతాన్ని అందిస్తారు. మీరు ఈ ఉద్యోగాలను సాధించి లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు(శుక్రవారం) నుంచే ప్రారంభమైంది.

విజయవాడలోని డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నిరుద్యోగులకు శుభవార్తను అందించింది. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిపికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 20 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 31 వరకు దరఖాస్తు ఫీజు చెల్లించి, ఫిభ్రవరి 1 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అధికారిక వెబ్ సైట్ http://drysruhs.edu.in/ ను పరిశీలించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన సమాచారం:

జూనియర్ అసిస్టెంట్ పోస్టులు:

  • 20

అర్హత:

  • అభ్యర్థులు బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:

  • అభ్యర్థులు 01.07.2024 నాటికి 18 – 42 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ:

  • ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతం:

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.25,220-రూ.80,910.

దరఖాస్తు ఫీజు:

  • ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు, దివ్యాంగులకు రూ.750. ఇతరులు రూ.1500 చెల్లించాలి.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌ లైన్‌

దరఖాస్తులు ప్రారంభం:

  • 12-01-2024.

ఫీజు చెల్లింపుకు చివరితేదీ:

  • 31-01-2024.

దరఖాస్తుకు చివరితేదీ:

  • 01-02-2024.

డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అధికారిక వెబ్ సైట్:

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి