iDreamPost

టెన్త్ పాసయ్యారా?.. ఈ ప్రభుత్వ ఉద్యోగాలు మీకోసమే!.. నెలకు రూ. 36 వేల వరకు జీతం!

మీరు పదోతరగతి ఉత్తీర్ణులయ్యారా? అంతటితో చదువు ఆపేసారా? అయితే మీలాంటి వారికి గుడ్ న్యూస్. హైదరాబాద్ సీసీఎంబీలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. నెలకు రూ. 36 వేల జీతం అందుకోవచ్చు.

మీరు పదోతరగతి ఉత్తీర్ణులయ్యారా? అంతటితో చదువు ఆపేసారా? అయితే మీలాంటి వారికి గుడ్ న్యూస్. హైదరాబాద్ సీసీఎంబీలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. నెలకు రూ. 36 వేల జీతం అందుకోవచ్చు.

టెన్త్ పాసయ్యారా?.. ఈ ప్రభుత్వ ఉద్యోగాలు మీకోసమే!.. నెలకు రూ. 36 వేల వరకు జీతం!

శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. ఒక లక్ష్యాన్ని ఏర్పర్చుకుని ప్రణాళికాబద్దంగా శ్రమిస్తే లక్ష్యఛేధన అంత కష్టమైన పనేం కాదు. యువత ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాల కోసం తెగ ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నవారికి అదిరిపోయే గుడ్ న్యూస్. కేవలం టెన్త్ పాసైతే చాలు మీరు గవర్నమెంట్ జాబ్స్ ను సాధించి జీవితంలో స్థిరపడిపోవచ్చు. హైదరాబాద్ లోని సీసీఎంబీ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ జాబ్స్ కు ఎంపికైతే ఏకంగా నెలకు రూ. 36 వేల వరకు జీతాన్ని అందుకోవచ్చు.

మీరు పదోతరగతి ఉత్తీర్ణులై ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నట్లైతే ఇదే మంచి అవకాశం. ఇలాంటి అవకాశం మళ్లీ మళ్లీ రాదు. హైదరాబాద్‌లోని సీఎస్ఐఆర్- సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 40 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో జనవరి 20 2024 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. అప్లై చేసుకోదలచిన అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం సీసీఎంబీ అధికారిక వెబ్ సైట్ https://www.ccmb.res.in/ ను పరిశీలించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం టెక్నీషియన్ పోస్టులు:

  • 40

విభాగాల వారీగా ఖాళీలు:

  • యానిమల్ హౌస్ 04, క్యాంటీన్ 04, గెస్ట్ హౌస్ 02, ఫార్మసిస్ట్ 01, ఎల్‌టీఎస్ 04, ఐటీ లాకోన్స్ 01, ఆర్&ఏసీ 04, ప్లంబర్ 03, మాసనరీ(తాపీపని) 02, కార్పెంటర్ 01, లాబోరేటరీ 12, ట్రాన్స్‌పోర్ట్ 02 ఖాళీలున్నాయి.

అర్హత:

  • అభ్యర్థులు కనీసం 55% మార్కులతో సైన్స్ సబ్జెక్టులతో ఎస్‌ఎస్‌సీ/ పదో తరగతి లేదా తత్సమానం, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణలై ఉండాలి. పోస్టులను బట్టీ సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి:

  • అభ్యర్థుల వయసు 28 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు ఫీజు:

  • అభ్యర్థులు దరఖాస్తు ఫీజు రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌ లైన్

ఎంపిక ప్రక్రియ:

  • ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

జీతం:

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.36,425 అందిస్తారు.

దరఖాస్తు ప్రారంభం:

  • 20-12-2023.

దరఖాస్తుకు చివరి తేదీ:

  • 20-01-2024.

సీసీఎంబీ అధికారిక వెబ్ సైట్:

https://www.ccmb.res.in/

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి