iDreamPost

లక్షకు పైగా జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు.. ఈ జాబ్స్ కొడితే లైఫ్ సెట్ అయినట్టే!

ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమైతే ఇదే మంచి ఛాన్స్. లక్షకు పైగా జీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ జాబ్స్ కొడితే లైఫ్ లో సెట్ అయిపోవచ్చు. అర్హులు ఎవరంటే?

ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమైతే ఇదే మంచి ఛాన్స్. లక్షకు పైగా జీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ జాబ్స్ కొడితే లైఫ్ లో సెట్ అయిపోవచ్చు. అర్హులు ఎవరంటే?

లక్షకు పైగా జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు.. ఈ జాబ్స్ కొడితే లైఫ్ సెట్ అయినట్టే!

ప్రస్తుత రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంతటి కాంపిటీషన్ ఉందో వేరే చెప్పక్కర్లేదు. ఏ చిన్న నోటిఫికేషన్ రిలీజ్ అయినా లక్షలాది మంది పోటీపడుతున్నారు. ప్రైవేట్ సెక్టార్ లో లక్షలు సంపాదించే కొలువులున్నప్పటికీ గవర్నమెంట్ జాబ్ కు ఉండే డిమాండ్ వేరే లెవల్ అని చెప్పొచ్చు. ఈ కారణంగానే ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు యువత ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. నిరంతరం పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి లైఫ్ లో స్థిరపడిపోవాలనుకునే వారికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గుడ్ న్యూస్ అందించింది. లక్షకు పైగా జీతంతో జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ ఉద్యోగాలకు అర్హులు ఎవరు? వయోపరిమితి ఎంత? ఆ వివరాలు మీకోసం..

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్న గ్రూప్‌-బి (నాన్‌ గెజిటెడ్‌) జూనియర్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 968 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచీల్లో డిప్లొమా, సంబంధిత కోర్సుల్లో ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు పోటీపడొచ్చు. అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఏప్రిల్ 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోదలిచిన వారు పూర్తి సమాచారం కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్ సైట్ https://ssc.gov.in/ ను పరిశీలించాల్సి ఉంటుంది.

పోస్టుల వివరాలు:

  • జూనియర్ ఇంజినీర్ (సి), బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (పురుషులకు మాత్రమే) పోస్టులు: 438
  • జూనియర్ ఇంజినీర్ (ఇ & ఎం), బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (పురుషులకు మాత్రమే) పోస్టులు: 37
  • జూనియర్ ఇంజినీర్ (సి), బ్రహ్మపుత్ర బోర్డు, జల శక్తి మంత్రిత్వ శాఖ పోస్టులు: 02
  • జూనియర్ ఇంజినీర్ (ఎం), సెంట్రల్ వాటర్ కమిషన్ పోస్టులు: 12
  • జూనియర్ ఇంజినీర్ (సి), సెంట్రల్ వాటర్ కమిషన్ పోస్టులు: 120
  • జూనియర్ ఇంజినీర్ (ఇ), సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ పోస్టులు: 121
  • జూనియర్ ఇంజినీర్ (సి), సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ పోస్టులు: 217
  • జూనియర్ ఇంజినీర్ (ఇ), సెంట్రల్ వాటర్ పవర్ రిసెర్చ్ స్టేషన్) పోస్టులు : 02
  • జూనియర్ ఇంజినీర్ (సి), సెంట్రల్ వాటర్ పవర్ రిసెర్చ్ స్టేషన్ పోస్టులు: 03
  • జూనియర్ ఇంజినీర్ (ఎం), డీజీక్యూఏ- నావల్‌, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పోస్టులు: 03
  • జూనియర్ ఇంజినీర్ (ఇ), డీజీక్యూఏ- నావల్‌, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పోస్టులు: 03
  • జూనియర్ ఇంజినీర్ (ఇ), ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్, జల శక్తి మంత్రిత్వ శాఖ పోస్టులు: 02
  • జూనియర్ ఇంజినీర్ (సి), ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్, జల శక్తి మంత్రిత్వ శాఖ పోస్టులు: 02
  • జూనియర్ ఇంజినీర్ (సి), మిలిటరీ ఇంజినీర్ సర్వీస్: ఇంకా ప్రకటించలేదు.
  • జూనియర్ ఇంజినీర్ (ఇ & ఎం), మిలిటరీ ఇంజనీర్ సర్వీస్: ఇంకా ప్రకటించలేదు.
  • జూనియర్ ఇంజినీర్ (సి), నేషనల్ టెక్నికల్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ పోస్టులు: 06

ముఖ్యమైన సమాచారం :

అర్హతలు:

  • అభ్యర్థులు డిప్లొమా (సివిల్‌/ మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌) తత్సమానం లేదా డిగ్రీ (సివిల్‌/ మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌) పాసై ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి:

  • సీపీడబ్ల్యూడీ విభాగం పోస్టులకు- 32 ఏళ్లు.. ఇతర పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు. ఆయా కేటగిరీ వర్గాల వారికి వయోపరిమితుల్లో సడలింపులు ఉన్నాయి.

జీతం:

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి సెవెన్త్‌ పే స్కేలు ప్రకారం రూ.35,400- రూ.1,12,400 వరకు అందుకోవచ్చు.

ఎంపిక విధానం:

  • పేపర్‌-1, పేపర్‌-2 రాత పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు:

  • అభ్యర్థులు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్‌లకు ఫీజు చెల్లించాల్సిన పనిలేదు.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌ లైన్‌

దరఖాస్తు ప్రారంభం:

  • 28-03-2024

దరఖాస్తులకు చివరి తేదీ:

  • 18-04-2024

సీబీటీ (పేపర్-I):

  • జూన్‌ 04 నుంచి 06 వరకు

సీబీటీ పేపర్ II:

  • ఇంకా ప్రకటించలేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి