iDreamPost

Sai Pallavi:ఆమె రూటే సపరేటు.. భిన్నంగా సాయి పల్లవి న్యూ ఇయర్‌ వేడుకలు!

  • Published Jan 02, 2024 | 1:41 PMUpdated Jan 02, 2024 | 1:41 PM

కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా సెలబ్రిటీస్ అంతా న్యూఇయర్ జోష్ లో ఉంటే సాయి పల్లవి మాత్రం తన రూటే సపరేట్ అంటూ అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఎంతో పద్ధతిగా కనిపించిన సాయి పల్లవి న్యూఇయర్ వేడుకనాడు చేసిన పని ప్రస్తతం నెట్టింట వైరల్ గా మారింది.

కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా సెలబ్రిటీస్ అంతా న్యూఇయర్ జోష్ లో ఉంటే సాయి పల్లవి మాత్రం తన రూటే సపరేట్ అంటూ అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఎంతో పద్ధతిగా కనిపించిన సాయి పల్లవి న్యూఇయర్ వేడుకనాడు చేసిన పని ప్రస్తతం నెట్టింట వైరల్ గా మారింది.

  • Published Jan 02, 2024 | 1:41 PMUpdated Jan 02, 2024 | 1:41 PM
Sai Pallavi:ఆమె రూటే సపరేటు.. భిన్నంగా సాయి పల్లవి న్యూ ఇయర్‌ వేడుకలు!

నేచురల్ స్టార్ సాయి పల్లవి ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. తనం అందం అద్భుతమైన నటనతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది. ఈమె తెలుగులో మెగా హీరోకు జంటగా ఫిదా సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. అలా ఫిదా సినిమాలో తన నటనతో యూత్ మనస్సులను ఫిదా చేసింది పల్లవి. ఇది ఇలా ఉంటే.. తాజాగా అందరూ కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టారు. ఈ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతు చేసుకున్న వేడుకలు అంతా ఇంత కాదు. అటు సామాన్యులతో పాటు సెలబ్రిటీస్ సైతం న్యూఇయర్ వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే సాయి పల్లవి మాత్రం తన రూటే సపరేట్ అంటూ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంతకి ఏం జరిగిందంటే..

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వేళ మన సినీ ఇండస్ట్రీలో చాలమంది సెలబ్రిట్రీస్ సింగిల్ గాను ఫ్యామీలీతోనూ ఎంజాయ్ చేసిన విషయం తెలిసిందే. ఇక చాలమంది హీరోయిన్లు బీచ్‌లో, బికీనీల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ చేసుకున్నారు. అయితే.. మన లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి మాత్రం తన రూటే సపరేట్ అంటూ ఆమె వైఖరితో అందర్నీ షాక్ గురైయ్యేలా చేసింది. తాజాగా కొత్త సంవత్సరం నాడు అందరూ న్యూయర్ జోష్ లో ఎంజాయ్ చేస్తూంటే ఈమె మాత్రం పుట్టపర్తి సాయిబాబా ప్రశాంతి నిలయంలో కనిపించారు. ఎంతో పద్ధతిగా నిండైన చీరలో తెలుగు తనం ఉట్టి పడేలా ప్రత్యేకంగా కనిపించి అందర్నీ ఆకట్టుకున్నారు. ఇక అక్కడ అందరితో పాటు సత్య సాయి నామ స్మరాన్ని జపిస్తూ.. ధ్యానంలో కనిపించరు. తరుచు తన సింపుల్ లుక్స్‌తో,యాటిట్యూడ్‌ లెస్‌ బిహేవియర్‌తో కనిపించిన ఈమె న్యూఇయర్ వేడుకల్లో ఇలా భగవంతుడి సన్నిధిలో కనిపించడంతో ఫ్యాన్స్ అంత ఫిదా అయ్యారు.

What did Sai Pallavi do for New Year

ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అనే ట్యాగ్ వచ్చేలా చేసుకున్న సాయి పల్లవి ఎంత ఎదిగినా ఒదిగే ఉంటుందని ప్రశసించారు. కాగా, ప్రస్తతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక సాయి పల్లవి యువ సామరాట్ నాగా చైతన్యకు జంటగా తాజాగా నటిస్తున్న చిత్రం తండేల్. ఇటివలే ఈ మూవీ ఓపెనింగ్ కార్యక్రమం జరిగగా ఆ ఈవెంట్ కి సాయి పల్లవి హజరయ్యారు. అనంతరం పూజ కార్యక్రమాల్లో పాల్గొని మీడియాతో మాట్లడిన విషయం తెలిసిందే. మరి, న్యూఇయర్ వేడుకల్లో సాయి పల్లవి సింప్లిసిటీ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి