iDreamPost

సినిమా కోసం కొత్త అవతారం ఎత్తిన టాలీవుడ్ యంగ్ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?

ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ ఓల్డ్ మ్యాన్ ఎవరో తెలుసా..? ఇటీవల ఓ మూవీతో హిట్ అందుకున్నాడు. వెరీ టాలెండ్ హీరో. హిట్, ప్లాపులతో సంబంధం లేకుండా దూసుకెళుతున్నాడు. ఇంతకు ఎవరంటే..?

ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ ఓల్డ్ మ్యాన్ ఎవరో తెలుసా..? ఇటీవల ఓ మూవీతో హిట్ అందుకున్నాడు. వెరీ టాలెండ్ హీరో. హిట్, ప్లాపులతో సంబంధం లేకుండా దూసుకెళుతున్నాడు. ఇంతకు ఎవరంటే..?

సినిమా కోసం కొత్త అవతారం ఎత్తిన టాలీవుడ్ యంగ్ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?

ఇండస్ట్రీలో స్టార్ హీరోలంతా.. ఓ సినిమా కమిట్ అయ్యాక.. దాని కోసం విపరీతంగా కష్టపడుతుంటారు. ప్రాజెక్టు స్టార్ట్ అవ్వగానే మూవీ కోసం లుక్స్ చేంజ్ చేస్తారు. మేకోవర్ అవుతుంటారు. సినిమా కోసం ప్రాణం పెట్టేస్తుంటారు. బాహుబలి మూవీ కోసం డార్లింగ్ ప్రభాస్ ఐదు సంవత్సరాలు పాటు ఏ సినిమా ఒప్పుకోకుండా.. ఆ మూవీకే కట్టుబడిపోయి ఉండటం ఓ ఉదాహరణ. అలాగే అల్లు అర్జున్ పుష్ప 2, దేవర మూవీ కోసం యంగ్ టైగర్ వంటి స్టార్ హీరోలు సినిమా కోసం కొన్ని సంవత్సరాలు కేటాయించారు. ఏ హీరో కూడా ఒకే రకమైన యాక్టింగ్ శైలిని అనుసరించడం లేదు. డిఫరెంట్ క్యారెక్టర్స్ ట్రై చేస్తున్నారు. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు ఈ ఫోటోలో కనిపిస్తున్న హీరో కూడా.

ఇటీవల ఓ సినిమాతో హిట్ అందుకున్న ఈ నటుడు వెరీ టాలెంటెడ్. ఇటీవల మినిమిమ్ గ్యారెంటీ హీరోగా అయ్యాడు. అటు కామెడీతో పాటు ఇటు ఫ్యామిలీ సినిమాలతో ఆకట్టుకుంటున్నాడు. చిన్న చిన్న రోల్స్ నుండి హీరోగా ఎదిగాడు ఈ కుర్ర హీరో. ఇంతకు ఆ నటుడు ఎవరంటే..శ్రీ విష్ణు. బాణం మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ హీరో.. సోలో మూవీలో కనిపించాడు. లవ్ ఫెయిల్యూర్, నా ఇష్టం, లైప్ ఈజ్ బ్యూటీఫుల్ వంటి చిత్రాల్లో చిన్న రోల్స్ చేశాడు. ప్రేమ ఇ ష్క్ కాదల్ మూవీతో లీడ్ యాక్టర్‌గా మారిన శ్రీ విష్ణు.. సెకండ్ హ్యాండ్, ఒక్కడినే, ప్రతినిధి వంటి చిత్రాలు చేశాడు. అతడికి మరోసారి గుర్తింపునిచ్చిన పాత్ర సన్నాఫ్ సత్యమూర్తి. ఇందులో అల్లు అర్జున్ ఫ్రెండ్ క్యారెక్టర్‌లో కనిపిస్తాడు.

ఆ తర్వాత వచ్చిన సినిమాలు బాగా ఆకట్టుకున్నాయి. అప్పట్లో ఒకడుండేవాడు, మా అబ్బాయి, మెంటల్ మదిలో, నీది నాది ఓకే కథ, వీర భోగ వసంత రాయ వంటి చిత్రాలు ఓకే అనిపించాయి. కాగా, బ్రోచేవారెవరురాతో హిట్ అందుకున్నారు. తిప్పరా మీసం, గాలి సంపత్, రాజ రాజ చోర, అర్జున పాల్గొన వంటి చిత్రాలు చేశాడు. కానీ సామజవరగమన, ఓం భీమ్ బుష్ వంటి సినిమాలతో మళ్లీ ఫాంలోకి వచ్చేశాడు. ఓం భీం బుష్‌లో అతడు రాహుల్, ప్రియదర్శిలతో కలిసి అతడు పండించిన కామెడీ బాగా వర్కౌట్ అయ్యింది. సినిమా హిట్ అయ్యింది. ఇప్పుడు స్వాగ్ అనే చిత్రంతో రాబోతున్నాడు. అందులోదే మీరు చూస్తున్న పిక్. శుక్రవారం వీడియో గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో డిఫరెంట్ లుక్స్‌లో కనిపించాడు ఈ యంగ్ హీరో. హసిత్‌గోలి దర్శకత్వంలో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో శ్రీవిష్ణు.. భవభూతి అనే స్త్రీ ద్వేషి పాత్రలో కనిపించబోతున్నాడట. రీతూ వర్మ హీరోయిన్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి