iDreamPost

విషాదం.. సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని RSI ఆత్మహత్య!

Old City RSI Passedaway: హైదరాబాద్ ఓల్ట్ సిటీలో ఘోరం జరిగింది. కబూతర్ ఖానా పరిధిలో విధులు నిర్వర్తించే టీఎస్ఎస్పీ రిజర్వ్ ఎస్ఐ ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Old City RSI Passedaway: హైదరాబాద్ ఓల్ట్ సిటీలో ఘోరం జరిగింది. కబూతర్ ఖానా పరిధిలో విధులు నిర్వర్తించే టీఎస్ఎస్పీ రిజర్వ్ ఎస్ఐ ఆత్మహత్యకు పాల్పడ్డారు.

విషాదం.. సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని RSI ఆత్మహత్య!

హైదరాబాద్ నగరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓల్ట్ సిటీలో RSI ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడు పాతబస్తీ కబూతర్ ఖానాలో విధులు నిర్వహిస్తున్న బాలేశ్వర్(48)గా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

ఆదివారం తెల్లవారుజామున ఓల్డ్ సిటీలో ఈ ఘోరం జరిగింది. కబూతర్ ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న బాలేశ్వర్ తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  బాలేశ్వర్ నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం లక్ష్మీపూర్ కి చెందిన బాలేశ్వర్ టీఎస్ఎస్పీ రిజర్వ్ ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నాడు. బాలేశ్వర్ ఆత్మహత్య వార్త తెలియగానే సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య, చార్మినార్ ఏసీపీ ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. ఘటనాస్థలంలో క్లూస్, వివరాలు సేకరించారు. అక్కడి పరిస్థితిని పరిశీలించారు. ఆ తర్వాత బాలేశ్వర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

అయితే బాలేశ్వర్ మృతికి సంబంధించిన కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై హుస్సేనీ హాలం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. బాలేశ్వర్ మృతి కేసును ఆత్మహత్య కోణంలో మాత్రమే కాకుండా.. గన్ మిస్ ఫైర్ అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, చుట్టుపక్కల వారి నుంచి కూడా వివరాలు, సమాచారం సేకరించారు. బాలేశ్వర్ మృతి ఘటనపై డీసీపీ సాయి చైతన్య స్పందించారు. బాలేశ్వర్ మృతికి కారణాలు తెలియాల్సి ఉంది అన్నారు. అలాగే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామన్నారు. పూర్తి వివరాలు దర్యాప్తు పూర్తయ్యాక వెల్లడిస్తామన్నారు.

కారణం ఏదైనా ఎవరైనా సరే ఆత్మహత్య చేసుకోవడం మాత్రం కరెక్ట్ కాదు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కుటుంబంలో ఇబ్బందులు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు అయి ఉండవచ్చు, మానసిక ఒత్తిడి కూడా కావచ్చు. కారణం ఏదైనా కావచ్చు. కానీ, దానికి పరిష్కారం వెతుక్కోవాలి. కానీ, ఆత్మహత్య చేసుకోవడం ముమ్మాటికి తప్పు అంటూ అభిప్రాయాలు వినిపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉంది. సర్వీస్ రివాల్వర్ తో ఆర్ఎస్ఐ ఆత్మహత్య చేసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి