iDreamPost

వినియోగదారులకు షాక్‌… భారీగా పెరిగిన గ్యాస్‌ ధర.. ఎంతంటే!

  • Published Jul 04, 2023 | 12:36 PMUpdated Jul 04, 2023 | 12:36 PM
  • Published Jul 04, 2023 | 12:36 PMUpdated Jul 04, 2023 | 12:36 PM
వినియోగదారులకు షాక్‌… భారీగా పెరిగిన గ్యాస్‌ ధర.. ఎంతంటే!

నేడు మార్కెట్‌లో ప్రతి దాని ధర పెరగడమే తప్ప తగ్గడం లేదు. ఇంధన ధరలు, కూరగాయల ధరలు, నిత్యవసరాలు ఇలా ప్రతి దాని ధర పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. ఇక కూరగాయల ధరలైతే మండిపోతున్నాయి. టమాటా ధర ఏకంగా 160-180 రూపాయలు పలుకుతుంది. పచ్చిమిర్చి ధర కిలో రూ.100 ఉంది. పెరిగిన ధరలతో సామాన్యుల జేబుకు చిల్లు పడుతుండగా.. దీనికి తోడు.. ఈ జాబితాలో ఇప్పుడు గ్యాస్‌ ధర కూడా చేరింది. ప్రతి నెల ప్రారంభంలో చమురు కంపెనీలు గ్యాస్‌ ధరల్లో మార్పులు చేస్తుంటాయి. దానిలో భాగంగానే ఈ నెలలో గ్యాస్‌ ధరలకు సంబంధించి చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. గ్యాస్‌ ధర పెంచుతూ సామాన్యులకు షాక్‌ ఇచ్చాయి ఆయిల్‌ కంపెనీలు. మరి గ్యాస్‌ ధర ఎంత పెరిగింది అంటే..

చమురు మార్కెటింగ్ కంపెనీలు జులై నెలకు సంబంధించి గ్యాస్‌ సిలిండర్‌ కొత్త రేట్లను ప్రకటించాయి. ఈ నెలలో కమర్షియల్‌ గ్యాస్‌ ధర పెరగ్గా.. సాధారణ గృహ వినియోగ సిలిండర్ రేట్లు మాత్రం స్థిరంగా ఉన్నాయి. 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ ధర పెరిగింది. పెరిగిన ధర ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్ ధర రూ.1780కి చేరింది. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్లను ఎక్కువగా..హోటళ్లు, రెస్టారెంట్లలో వినియోగిస్తుంటారు. ఇటీవల జూన్‌లో ఈ సిలిండర్ ధరలు తగ్గగా.. ఈ నెలలో మళ్లీ పెరిగాయి.

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేట్లు మారినప్పటికీ.. గృహ వినియోగానికి వాడే డొమెస్టిక్‌ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు. అయితే కమర్షియల్‌ సిలిండర్‌ ధరలు ఏప్రిల్, మే, జూన్‌లలో వరుసగా తగ్గగా ఈ నెలలో పెరగడం విశేషం. సుమారు 3 నెలల తర్వాత కమర్షియల్‌ గ్యాస్ సిలిండర్‌ ధరలు ఇప్పుడే పెరిగాయన్నమాట. ఇక డొమెస్టిక్ కుకింగ్ గ్యాస్ విషయానికి వస్తే దీని ధర ప్రాంతాలను బట్టి మారుతుంటుంది. స్థానికంగా విధించే పన్నులు ఇందుకు కారణంగా చెప్పొచ్చు.

దేశీయంగా ఎల్‌పీజీ ధరలు అనేవి.. అంతర్జాతీయ మార్కెట్‌లోని క్రూడాయిల్ రేట్లను బట్టి నిర్ణయించబడతాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ కంపెనీలు.. ప్రతి నెలా ఈ వంట గ్యాస్ సిలిండర్ ధరల్ని సవరిస్తూ ఉంటాయి. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా వీటిల్లో కూడా మార్పులు ఉంటాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి