iDreamPost

కేంద్రం సరికొత్త నిర్ణయం – ఆందోళనలు మరింత పెంచనుందా..?

కేంద్రం సరికొత్త నిర్ణయం – ఆందోళనలు మరింత పెంచనుందా..?

నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్ట్రర్‌(ఎన్‌పీఆర్‌)ను తాజా సవరించేందుకు కేంద్ర కేబినేట్‌ ఆమోదం తెలిపింది. దేశ వ్యాప్తంగా ప్రజల వివరాలు సేకరించేందుకు 3,941 కోట్లు మంజూరు చేస్తూ కేంద్ర మంత్రి వర్గం తీర్మానించింది. ఒక ప్రాంతంలో కనీసం ఆరు నెలలు నుంచి ఉంటున్న. లేదా రాబోయి ఆరు నెలలు ఒక ప్రాతంలో ఉంటున్న వారి వివరాలు ఈ ఎన్‌పీఆర్‌లో పొందుపరుస్తారు. ఆయా ప్రజలకు సంబంధించిన సాధారణ సమాచారం 14 అంశాల్లో సేకరించి రిజిస్ట్రర్‌ చేయనున్నారు.

2010లో మొదటి సారి..

యూపీఏ హాయంలో మొదటి సారిగా 2010లో ఎన్‌పీఆర్‌ను చేపట్టారు. 2015లో మరోసారి సవరించారు. తాజాగా రెండో సారి ఇప్పడు సవరించబోతున్నారు. ఎన్‌పీఆర్‌ పూర్తి చేసిన తర్వాత ఆయా కుటుంబాలకు కార్డు మంజూరు చేయనున్నారు. ఆ కార్డు ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలకు అర్హత ప్రకారం దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతోపాటు జాతీయ జన గణనకు కూడా కేంద్ర మంత్రి వర్గం నిధులు మంజూరు చేసింది. ఇందు కోసం 8,754.23 కోట్ల రూపాయలు కేటాయించింది.


పరిస్థితులు భిన్నం..

ప్రస్తుతం జాతీయ పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు తీవ్ర రూపం దాలచ్చాయి. దీనికి తోడుగా నేషనల్‌ రిజిస్ట్రార్‌ ఆఫ్‌ సిటిజన్‌ (ఎన్‌ఆర్‌సీ)కి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఎన్‌ఆర్‌సీని బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యతిరేకించారు. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చేయతలపెట్టిన ఎన్‌పీఆర్‌ ప్రజల్లో మరింత అలజడిని పెంపొందిస్తుందనడంలో సందేహం లేదు. ప్రజల్లో నెలకొన్న ఆందోళన, భయాలను తొలగించి, వారిలో నమ్మకాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నదనేది ఇప్పడు ఆసక్తికరంగా మారింది. ప్రజల నమ్మకాన్ని పొందడంలోనే కేంద్రప్రభుత్వం చేపట్టబోతున్న ఎన్‌పీఆర్‌ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయనడంలో సందేహం లేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి