iDreamPost

వాట్సాప్‌లో 2gb ఫైల్స్ వరకు పంపొచ్చు.. మీకు ఈ ఆప్షన్ వచ్చిందా.. చెక్ చేసుకోండి..

వాట్సాప్‌లో 2gb ఫైల్స్ వరకు పంపొచ్చు.. మీకు ఈ ఆప్షన్ వచ్చిందా.. చెక్ చేసుకోండి..

వాట్సాప్‌లో (Whatsapp) మనం ప్రస్తుతం చాలా తక్కువ డేటా ఉన్న ఫైల్స్ మాత్రమే పంపించగలం. దాదాపు 60 MB
ఫైల్స్ వరకు మాత్రమే పంపగలం. కానీ ఇటీవల వాట్సాప్ లో కూడా 2 gb ఫైల్స్ వరకు పంపించుకునే సదుపాయాన్ని త్వరలోనే ఇస్తామని ప్రకటించి దానిపై పని చేశారు. తాజాగా కొందరు యూజర్లకు ఈ సదుపాయం వచ్చింది. వాట్సాప్ లో ఎవరికైనా 2gb వరకు సైజ్‌ కలిగిన ఫైల్స్‌ను పంపుకొనే అవకాశం ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ వినియోగదారులకు లభించింది.

అయితే ఇప్పటికే కొంతమంది యూజర్లకి ఈ అప్డేట్ వచ్చింది. మీ వాట్సాప్‌లో ఈ సదుపాయం మీకు వచ్చిందో లేదో తెలుసుకోవాలంటే.. 100 ఎంబీకి మించి 2జీబీ లోపల ఉన్న ఫైల్‌ను ఎవరికైనా షేర్ చేసి చూడండి. ఒకవేళ 100 ఎంబీకి మించి ఫైల్‌ వెళ్ళినట్లైతే ఆ సదుపాయం మీకు కూడా వచ్చినట్టే. ఒకవేళ ఫెయిల్‌ అయితే మీరు మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. అలాగే యాప్ ని అప్డేట్ కూడా చేయండి.

మనం అన్ని ఫైల్స్ ని వాట్సాప్ ద్వారానే అందరికి షేర్ చేస్తూ ఉంటాము. కానీ ఎక్కువ సైజ్ ఉన్న ఫైల్స్ ని పంపాలంటే వేరే మాధ్యమాలు వెతుక్కోవాల్సి వస్తుంది. దీంతో వినియోగదారుల అభ్యర్థన మేరకు వాట్సాప్ లో ఈ ఫీచర్ ని జోడించారు. మరి కొద్ది రోజుల్లో అందరికి ఈ సదుపాయం రానుంది. దీంతో ఏకంగా సినిమాలు కూడా షేర్ చేసుకోవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి