iDreamPost

Nothing Phone (1) నథింగ్ ఫోన్ (1) ఎలా ఉంది? ఎందుకు కొనాలి? ఎందుకు కొన‌కూడ‌దు? రివ్యూవ‌ర్స్ ఏమంటున్నారు?

Nothing Phone (1)  నథింగ్ ఫోన్ (1) ఎలా ఉంది? ఎందుకు కొనాలి? ఎందుకు కొన‌కూడ‌దు?  రివ్యూవ‌ర్స్ ఏమంటున్నారు?

ఈ నాలుగైదేళ్ల‌లో బాగా హైప్ చేసిన‌ స్మార్ట్‌ఫోన్‌లలో నథింగ్ ఫోన్ 1 ఒకటి. Nothing Phone (1) కొత్త‌ది, చాలా స్పెష‌ల్ అని ప్ర‌చారం చేశారు. మ‌రి కొత్త ఫోన్, మిడ్ సెగ్మెంట్ ఆండ్రాయిడ్ సూప‌ర్ స్టార్ల‌కు ధీటుగా ఉందా? Nothing Phone (1) ఇండియాతో స‌హా ప్ర‌పంచ మార్కెట్లో రిలీజ్ అయ్యింది. 8GB RAM + 128GB storage modelకి రూ. 32,999 ధ‌ర‌. కాని ఎక్కువ క‌ల‌ర్స్ అప్ష‌న్ లేదు. తెలుపు, న‌లుపు మాత్ర‌మే

రూ.30000-40000 సెగ్మెంట్‌లో అన్ని మోడ‌ల్స్ దాదాపు ఒకేలా ఉంటాయి. పెర్ ఫార్మెన్స్ కూడా అంతే. కాని నథింగ్ ఫోన్ (1) విషయంలో ఈ ఆర్గ్యుమెంట్ ప‌నికిరాదు. దీన్ని చూసిన వెంట‌నే మీకు ఇష్ట‌ప‌డ‌తారు. లేదంటే అస‌హ్యించుకొంటారు. అంతే త‌ప్ప‌ యావ‌రేజ్ అన్న మాటేరాదు. డిజైన్ అలాగుంటుంది మ‌రి. స్మార్ట్ ఫోన్ ప‌రిశ్ర‌మ ద‌శాబ్ధాల నాటిది. డిజైన్స్ చాలా స్టాండ‌ర్ట్స్ వ‌చ్చేశాయి. అందుకే మ‌రీ సూప‌ర్ అనేటంత‌గా ఏదీ ఉండ‌దు. ఇప్పుడు ఫోన్ అంటే రెండు గాజుల మ‌ధ్య శాండివిచ్ చేసే హార్డ్ వేర్ మాత్ర‌మే. నథింగ్ ఫోన్ (1) అదే గ్లాస్-శాండ్‌విచ్ డిజైన్ ఉప‌యోగించింది. కాని, మోనోటోన్ కలర్ ఎలిమెంట్‌లతో, బ్యాక్ సైడ్ లోప‌లి పార్టులు క‌నిపించేలా ఉంటుంది.

అలాగ‌ని ఇదేమీ పూర్తిగా కొత్త కాన్సెప్ట్ కాదు. ఇలాంటి మోడ‌ల్స్ ట్రైచేసిన‌ స్మార్ట్‌ఫోన్ తయారీదారులు ఉన్నారు. కాక‌పోతే నథింగ్ ఫోన్ (1) ఎందుకు డిఫ‌రెంట్ అంటే? బ్యాక్ సైడ్ అంతా ట్రాన్స‌ప‌రెంట్. వైర్‌లెస్ ఛార్జింగ్ కాయిల్‌లు, స్మార్ట్‌ఫోన్‌ల కోసం వైరింగ్ మ‌న‌కు క‌నిపిస్తాయి. వెనుక ప్యానెల్ ప్లేట్‌లను బిగించే స్క్రూలు, బ్యాక్ లైట్లు ఉంటాయి.

నథింగ్ ఫోన్ (1) గ్లిఫ్ ఇంటర్‌ఫేస్ (Glyph Interface)
గ్లిఫ్ ఇంటర్‌ఫేస్ అంటే మీరు వెనుక ప్యానెల్‌లోని లైట్లను ఉపయోగించగల ఫీచర్. డిఫాల్ట్ సెట్టింగ్‌లు ఆన్‌లో ఉంటే, నథింగ్ ఫోన్ (1) ఫోన్ రింగ్ అయినప్పుడు, నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాత్రమే లైట్లు వెలుగుతాయి. నథింగ్ ఫోన్ 1 కోసం ప్రత్యేకంగా రూపొందించిన రింగ్‌టోన్‌లు ఉన్నాయి. అందువ‌ల్ల కాల్ వ‌చ్చిందంటే కొత్త‌గా మ్యూజిక్ వినిపిస్తుంది. మ్యూజిక్ వ‌చ్చిన‌ప్పుడు బ్యాక్ సైడ్ లైట్లు వెలుగుతుంటే ఎలాగుంటుంది? అదో మ్యాజిక్ క‌దా!

నథింగ్ ఫోన్ (1) డిస్ప్లే(Nothing Phone (1) Display)
ఇప్పుడు డిస్ప్లే ప్యానెల్ గురించి మాట్లాడుకొందాం. నథింగ్ ఫోన్ (1) FullHD+ రిజల్యూషన్‌తో , 6.55-అంగుళాల ప్యానెల్ తో వ‌స్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది. బ్యాట‌రీ ఎక్కువ సేపు రావాలంటే 60Hzకి లిమిట్ కావ‌చ్చు. డిస్ ప్లే గురించి రివ్యూవ‌ర్స్ కు పెద్ద‌గా కంప్లెంట్లు ఏమీ లేవు. మీకు న‌చ్చిన‌ట్లు క‌ల‌ర్ టెంప‌రేచ‌ర్ మార్చుకోవ‌చ్చు, కాబ‌ట్టి, మీకూ న‌చ్చుతుంది. డిస్‌ప్లే క్లాస్-లీడింగ్ కాదు. చూడ‌గానే సూప‌ర్ అని విజ‌లేసేటంత క్వాలిటీ లేదు. కాని, ఫ్లాట్ స్క్రీన్ , డీసెంట్-సైజ్ బెజెల్ ల‌తో, చేతిలో ప‌ట్టుకోగానే ప్రీమియం ఫీలింగ్ మాత్రం వ‌స్తుంది.

నథింగ్ ఫోన్ (1) పెర్ ఫార్మెన్స్? Nothing Phone (1) Performance

నథింగ్ ఫోన్ 1 Qualcomm Snapdragon 778G+ను వాడింది. వైర్‌లెస్ ఛార్జింగ్ , 5G వంటి కొన్ని అదనపు ఫీచర్‌లున్నాయి. రోజువారీ ప‌నుల‌ను హ్యాపీగా చేసుకోవ‌చ్చు. 120Hz డిస్‌ప్లే తో ఫోన్ చూడ‌టానికి బాగుటుంది.

అపెక్స్ లెజెండ్స్ మొబైల్ వంటి గ్రాఫికల్ ఇంటెన్స్ గేమ్స్ ఆడుతున్న‌ప్పుడు ఫ్రేమ్ డ్రాప్‌లు లేవు. బాగా పనిచేసింది. ఫోన్ వేడి పెరిగిందికాని, ఫోన్‌ని హ్యాండిల్ చేయడం కష్టం బాబాయో అనే రేంజ్ లో మాత్రం లేదన్న‌ది రివ్యూవ‌ర్స్ మాట‌.

నథింగ్ ఫోన్ (1) కెమెరా Nothing Phone (1) Camera

నథింగ్ ఫోన్ (1) డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. చూడ‌టానికి చాలా సింపుల్. సెన్సార్ల ప‌రంగా కాస్తంత వెనుకబడినా, టెలిఫోటో, మాక్రో లెన్స్ క్వాలిటీ ఫోటోల‌నిస్తున్నాయి. ప్రైమ‌రీ లెన్స్ 50-మెగాపిక్సెల్ సోనీ IMX766 సెన్సార్. లెన్స్ డ్యూయల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 10-బిట్ కలర్ వీడియోలను సపోర్ట్ చేస్తుంది. ఫోటోలో క్వాలిటీకోసం AIని ఉపయోగించే నైట్ మోడ్, సీన్ డిటెక్షన్ మోడ్ ఫీచ‌ర్స్ ఉన్నాయి.

పగటిపూట ఫోటోల‌ను బాగానే క్లిక్ చేస్తుంది. ప్రిమియం రేంజ్ ఫోటో క్వాలిటీ మాత్రంకాదు. లైట్ త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు నైట్ మోడ్ ఆన్ చేయాలి. కాస్త బెట‌ర్ ఫోటోలు తీయొచ్చు.

నథింగ్ ఫోన్ (1) బ్యాటరీ, ఛార్జింగ్ Nothing Phone (1) Battery and Charging

నథింగ్ ఫోన్ (1) 4500mAh బ్యాటరీ యూనిట్‌తో త‌యారైంది. 33W వైర్డు ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ , 5W రివర్స్ ఛార్జింగ్ స్పీడ్‌ని ఇస్తుంది. బ్యాట‌రీస్ మీద పెద్ద కంప్లెంట్స్ లేవు.

నథింగ్ ఫోన్ (1) చాలా సంచలనాన్ని సృష్టించింది, నథింగ్ ఫోన్ (1) చూస్తుంటే కొత్త ఫొన్ ను చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. కెమెరా అంత గొప్ప‌గా ఏం ఉండ‌న‌క్క‌ర్లేదు, పెద్ద పెద్ద గేమ్స్ మేం ఆడం అనుకున్న‌వాళ్లు, న‌థింగ్ ఫోన్ ను వాడొచ్చు. కెమెరా ముఖ్య‌మ‌నుకొంటే మాత్రం, వేరే బ్రాండ్స్ లో ట్రైచేయొచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి