iDreamPost

మొదలైన నామినేషన్ల పర్వం.. అత్యధికంగా రూ.124.49 కోట్ల ఆస్తులను ప్రకటించిన అభ్యర్థి

  • Published Nov 04, 2023 | 11:48 AMUpdated Nov 04, 2023 | 11:48 AM

తెలంగాణలో శుక్రవారం నామినేష్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. 11 గంటల నుంచి నామినేషన్ ప్రక్రియ మొదలైంది. మొదటి రోజు ఎక్కువగా స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు ఎక్కువగా సమర్పించారు.

తెలంగాణలో శుక్రవారం నామినేష్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. 11 గంటల నుంచి నామినేషన్ ప్రక్రియ మొదలైంది. మొదటి రోజు ఎక్కువగా స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు ఎక్కువగా సమర్పించారు.

  • Published Nov 04, 2023 | 11:48 AMUpdated Nov 04, 2023 | 11:48 AM
మొదలైన నామినేషన్ల పర్వం.. అత్యధికంగా రూ.124.49 కోట్ల ఆస్తులను ప్రకటించిన అభ్యర్థి

గత నెల దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ రిలజ్ చేసింది ఎన్నికల సంఘం. నిన్న శుక్రవారం తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ నామినేషన్ల ప్రక్రియ నవంబర్ 10 వరకు కొనసాగుతుంది.. సమయం మించిన తర్వాత నామినేషన్లు స్వీకరించబడవని ఎన్నికల సంఘం తెలిపింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేష్ల ప్రక్రియ మొదలు పెట్టారు. మొదటి రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువగా ఇండిపెండెంట్ సభ్యులు తమ నామినేషన్లు సమర్పించారు. తొలిరోజు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన 94 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ నుంచి 8, బీజేపీ నుంచి ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. కాకపోతే తొలిరోజు అధికార పార్టీ బీఆర్ఎస్ తరుపు నుంచి ఒక్కరు కూడా నామినేషన్ కూడా సమర్పించలేదు. వివరాల్లోకి వెళితే..

మొత్తానికి అందరూ ఎదురు చూస్తున్న నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. తొలిరోజు నామినేషన్లు వేసేందుకు ఎమ్మెల్యే అభ్యర్థులు ఉత్సాహం చూపించారు. కాకపోతే ప్రధాన పార్టీ నేతలు కాకుండా ఇతర పార్టీ నేతలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు తొలిరోజు నామినేషన్ లో ఎక్కువగా పాల్గొన్నారు. శుక్రవారం నామినేషన్ నోటిఫికేషన్ రిలీజ్ కాగానే.. తొలి నామినేషన్ కోదాడ అసెంబ్లీ3 నియోజకవర్గం నుంచి దాఖలైంది. ఇండిపెండెంట్ అభ్యర్థి జలగం సుధీర్ తన నామినేషన్ ను దాఖలు చేశారు. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఉదయం 11 గంటలకు ఆయన ఆన్ లైన్ లో తన నామినేషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి తరుపున కొండగల్ లో ఆయన సోదరుడు తిరుపతి రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఇక ఖమ్మం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు నామినేషన్ చేశారు. మొత్తానికి తొలిరోజు నామినేషన్ల పర్వం బాగానే సాగింది.

ఇక నామినేషన్లు దాఖలు చేసే సమయంలో కొన్ని నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అభ్యభర్థులు తమకు సంబంధించిన ఆస్తులు, అప్పులకు సంబంధించిన వివరాలు అఫిడవిట్ లో పొందుపర్చాల్సి ఉంటుంది. ఇక మొదటి రోజు నామినేషన్లలో అత్యధికంగా శేర్ లింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి అయిన వి.జగదీశ్వర్ గౌడ్ రూ.129.49 కోట్ల ఆస్తులు ప్రకటించారు. 77 ఏకరాల వ్యవసాయం, 8.34 ఎకరాలు వ్యవసాయేతరు భూములతో పాటు ఇళ్లు, ఫ్లాట్లు ఉన్నట్లు తన అఫిడవెట్ లో సమర్పించారు. ఆ తర్వాత ముథోల్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన నారాయణరావు పాటిల్ రూ.67.66 కోట్లు ఉన్నట్లుగా, ఆలేరు కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల ఐలయ్య రూ.42.14 కోట్లు, వరంగల్ తూర్పు బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ కుమార్ రావు రూ.26.96 కోట్లు, ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు రూ.17.88 కోట్లు ఉన్నట్లు, భూపాలపల్లి కాంగ్రెస్ అభ్యర్థి అయిన గండ్ర సత్యనారాయణ రావు రూ.11.90 కోట్లు, చేవెళ్ల బీజేపీ అభ్యర్థి అయిన కేఎస్ రత్నం రూ.4.84 కోట్లు ఉన్నట్లు, ఇక కాంగ్రెస్ గోషామహల్ అభ్యర్థి మొగిలి సునిత రూ.3.59 కోట్లు ఉన్నట్లుగాను, బెల్లంపల్లి బీజేపీ అభ్యర్థి శ్రీదేవి రూ.1.66 కోట్లు, సిర్పూర్ కాంగ్రెస్ అభ్యర్థి రావి శ్రీనివాస్ రూ.1.47 కోట్లు కలిగివ ఉన్నట్లు అఫిడవెట్ లో చూపించారు. మిగతా చాలా వరకు ఇండిపెండెంట్ అభ్యర్థులు తమ నామినేషన్లు సమర్పించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి