iDreamPost

Nirnayam : మేజిక్ చేయలేకపోయిన మలయాళం రీమేక్

హాలీవుడ్ మూవీ 'స్టేక్ అవుట్'ని స్ఫూర్తిగా తీసుకుని దీన్ని తీశారు.కేరళలో వంద రోజులు ఆడిందీ బొమ్మ. శివతో వచ్చిన ఇమేజ్ కి తగ్గట్టు స్క్రిప్ట్ లను ఎంచుకోవడంలో నాగార్జున తడబాటుకు గురవుతున్న సమయమది.

హాలీవుడ్ మూవీ 'స్టేక్ అవుట్'ని స్ఫూర్తిగా తీసుకుని దీన్ని తీశారు.కేరళలో వంద రోజులు ఆడిందీ బొమ్మ. శివతో వచ్చిన ఇమేజ్ కి తగ్గట్టు స్క్రిప్ట్ లను ఎంచుకోవడంలో నాగార్జున తడబాటుకు గురవుతున్న సమయమది.

Nirnayam : మేజిక్ చేయలేకపోయిన మలయాళం రీమేక్

కామెడీ ప్లస్ యాక్షన్ ని బ్యాలన్స్ చేస్తూ రివెంజ్ డ్రామాతో ప్రేక్షకులను మెప్పించడం అంత సులభం కాదు. ట్రీట్మెంట్ ఎంత బాగున్నా హీరో ఇమేజ్ తో పాటు వివిధ భాషల ఆడియన్స్ టేస్ట్ లను పరిగణనలోకి తీసుకోవడం చాలా అవసరం. లేకపోతే ఫలితం మారిపోతుంది. ఎలాగో చూద్దాం. 1989లో మోహన్ లాల్ హీరోగా ప్రియదర్శన్ దర్శకత్వంలో వచ్చిన ‘వందనం’ మలయాళంలో పెద్ద హిట్టు. గీతాంజలి ఫేమ్ గిరిజ హీరోయిన్ గా నటించింది. హాలీవుడ్ మూవీ ‘స్టేక్ అవుట్’ని స్ఫూర్తిగా తీసుకుని దీన్ని తీశారు.కేరళలో వంద రోజులు ఆడిందీ బొమ్మ. శివతో వచ్చిన ఇమేజ్ కి తగ్గట్టు స్క్రిప్ట్ లను ఎంచుకోవడంలో నాగార్జున తడబాటుకు గురవుతున్న సమయమది.

అదే టైంలో వందనం చూసిన నిర్మాత కం నటులు మురళీమోహన్ కు ఇది రీమేక్ చేస్తే బాగుంటుందన్న ఆలోచన కలిగింది. నాగ్ కూడా కథ నచ్చితే చాలు మనవాడా కాదా లాంటివేవీ ఆలోచించడం లేదు. పైగా ఒరిజినల్ వెర్షన్ ని డీల్ చేసిన ప్రియదర్శనే ఇక్కడా హ్యాండిల్ చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడంతో జయభేరి బ్యానర్ మీద దీని పునఃనిర్మాణానికి ఏర్పాట్లు జరిగిపోయాయి. హీరోయిన్ గా అమల ఎంపికయ్యింది. పెళ్లికి ముందు తర్వాత నాగ్ తో ఆవిడ కలిసి నటించిన ఆఖరి సినిమా ఇది. ఇళయరాజా సంగీతం, ఎస్ కుమార్ ఛాయాగ్రహణం, గణేష్ పాత్రో సంభాషణలు అందించారు. శరత్ సక్సేనా, గిరిబాబు, అల్లు, శుభలేఖ సుధాకర్ ఇతర తారాగణం

కొందరు దుర్మార్గుల వల్ల జీవితం నాశనమై జైలుకు వెళ్లిన రఘురాం(మురళీమోహన్)అక్కడి నుంచి తప్పించుకుని రహస్యంగా బ్రతుకుతుంటాడు. అతన్ని పట్టుకోవాలనే ఉద్దేశంతో కూతురు గీత(అమల)కు పోలీసని చెప్పకుండా దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తాడు వంశీకృష్ణ(నాగార్జున). ఆ తర్వాత నిజం తెలుసుకుని తన చేతుల మీదుగానే రఘురాంతో పగను పూర్తి చేయిస్తాడు. హాస్యంతో పాటు ఎవర్ గ్రీన్ అనిపించే పాటలు, కావాల్సినంత యాక్షన్ ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ లో డ్రామా పాలు కాస్త ఎక్కువ కావడంతో 1991 ఫిబ్రవరి 21 విడుదలైన నిర్ణయం అంచనాలను పూర్తి స్థాయిలో అందుకోలేక యావరేజ్ కు ఓ మెట్టు పైన నిలిచింది. కానీ దశాబ్దాలు దాటుతున్న హలో ప్రేమ కోసమే రోయ్ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం పాట మెస్మరైజ్ చేస్తూనే ఉంది.

Also Read : Jagan : ఏపి ముఖ్యమంత్రి పేరుతో పాత సినిమా – Nostalgia

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి