iDreamPost

నిర్భయ దోషులకు ఉరి ఖరారు

నిర్భయ దోషులకు ఉరి ఖరారు

ఢిల్లీ నిర్భయ దోషులకు ఉరి ఖారరైంది. ఈ నెల 22వ తేదీ ఉదయం ఏడు గంటలకు నలుగురు దోషులను ఉరి తీయాలని ఢిల్లీలోని పాటియాల హౌస్‌ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ మేరకు డెత్‌ వారెంట్‌ జారీ చేసింది. విచారణ సమయంలో దోషి ముకేష్‌ తన ఆరోగ్యం ఇంకా కుదుట పడలేదని, అప్పటి వరకు తీర్పు వాయిదా వేయాలని పిటిషన్‌ వేయగా, న్యాయస్థానం తోసిపుచ్చింది.

ఈ కేసులో మొత్తం ఆరుగురు దోషులు కాగా ఒకరు ట్రైయిల్‌ జరుగుతున్నసమయంలోనే తీహార్‌ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. మిగిలిన ఐదుగురిలో ఒకరు మైనర్‌ కావడంతో జువైనల్‌ హోంకు తరలించారు. మిగిలిన నలుగురి పిటిషన్ల సుప్రిం కోర్టులో కూడా విచారణలు పూర్తయ్యాయి. అయినా ఒక్కొక్కరుగా సుప్రింలో పిటిషన్‌ దాఖలు చేయడం, రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకోవడం చేస్తుండడంతో శిక్షను వాయిదా వేసుకోవాలనే ఉద్దేశం కనపడుతోందని నిర్భయ తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు.

ఈ నేపధ్యంలో ఇటీవల సుప్రింలో దోషులు వేసిన పిటిషన్‌ను న్యాయమూర్తులు తోసిపుచ్చుతూ గత తీర్పును సమర్థిస్తూ తీర్పునిచ్చారు. ఈ నేపధ్యంలో ఈ రోజు పాటియాల కోర్టు తీర్పును వెలువరిచింది. ఈ నెల 22వ తేదీన ఉదయం 7 గంటలకు దోషులను ఉరి తీయాలని డెత్‌ వారెంట్‌ జారీ చేసింది. కాగా, దోషుల్లో ఇద్దరి క్షమాభిక్ష పిటిషన్లు రాష్ట్ర పతి వద్దపెండింగ్‌లో ఉన్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి