మధ్యప్రదేశ్ రైతులు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు విన్నూత్న లేఖ రాసారు. భారత్ నుండి పాకిస్తాన్ కు టమాటాలు ఎక్కువగా ఎగుమతి అవుతుంటాయి . ముఖ్యంగా మధ్యప్రదేశ్ లోని జబువా ప్రాంతం నుండి ఎక్కువగా టమాటాలు ఎగుమతి అవుతాయి.ప్రస్తుతం టమాటా కొరతతో పాకిస్తాన్ లో టమోటా ధర కిలో 400 కు చేరింది. పాకిస్తాన్‌లో టమోటా ధరలు దిగివస్తే కేవలం కూరగాయల ధరలు తగ్గడం మాత్రమే కాకుండ భారత్ పాకిస్తాన్ ల మధ్య సామరస్య వాతావరణం కూడా ఏర్పడుతుందని పాకిస్తాన్ ప్రధానికి మధ్యప్రదేశ్ రైతులు లేఖలో సలహా ఇచ్చారు. ఈ మేరకు జబువా రైతు సంఘం పాక్ ప్రధానికి లేఖ రాసింది.
కానీ మధ్య ప్రదేశ్ నుంచి పాకిస్తాన్‌కు టమోటాలు పంపించాలంటే కొన్ని షరతులకు ఇమ్రాన్ ఒప్పుకోవాల్సిందేనని కూడా రైతులు లేఖలో సూచించారు. ‘‘పారిపోయి వచ్చి పాకిస్తాన్‌లో తలదాచుకుంటున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను భారత్‌కు అప్పగించాలి. 26/11 ముంబై దాడులకు పాల్పడినందుకు క్షమాపణ చెప్పాలి…’’ అని మధ్యప్రదేశ్ రైతులు డిమాండ్ చేశారు.గతంలో భారత్ నుండి విరివిగా పాకిస్తాన్ కు ఎగుమతి అయ్యేవి. కానీ ఫిభ్రవరి 14 పుల్వామా ఉగ్రదాడి వల్ల పాకిస్తాన్ కు టమాటా ఎగుమతులు నిలిపివేశారు. కాగా రెండురోజుల క్రితం “పీఓకే ఇచ్చేయ్ – టమాటాలు పట్టుకెళ్ళు” అని మధ్యప్రదేశ్ రైతులు నినాదాలు చేస్తూ ఆందోళన కూడా నిర్వహించారు. ఈ ఆఫర్ పై పాకిస్తాన్ ప్రధాని ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.