ఢిల్లో 2012 లో జరిగిన నిర్భయ ఘటన నిందితులను దిశ ఘటన తరహాలోనే శిక్షించాలని ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ డిమాండ్ చేశారు. దిశ నిందితులకు వేగంగా శిక్ష పడేలా చేయాలనీ, వారికి ఉరి శిక్ష వేయాలని స్వాతి ఈ నెల 3వ తేదీ నుంచి ఢిల్లీ లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. మూడు రోజులుగా ఆమె దేశ రాజధాని లో తన నిరసన కొనసాగిస్తున్నారు. ఢిల్లీలో 66 వేల పొలిసు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని తక్షణమే భర్తీ చేయాలనీ డిమాండ్ చేస్తూ [ప్రధానికి లేఖ రాశారు. కాగా, మూడు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న స్వాతి, దిశ ఎన్కౌంటర్ చేయడంపై ఆమె స్పందిందించారు. మీడియా తో మాట్లాడారు. నిర్భయ నిందితులను కూడా ఇలానే శిక్షించాలని డిమాండ్ చేశారు. తానూ 7 ఏళ్లుగా నిర్భయ నిందితులకు శిక్ష పడాలని పోరాటం చేస్తున్నానని తెలిపారు. దిశ ఘటన లాగే, నిర్భయ పై ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.