బిగ్‌బాస్ 4 తెలుగు రియాల్టీ షోకి సంబంధించి ఎలిమినేషన్ కోసం నామినేషన్ ప్రక్రియ జరిగింది. మొత్తం ఏడుగురు నామినేట్ అయ్యారు తొలి వారం ఎలిమినేషన్ ప్రక్రియకు సంబంధించి. వారిలో దివి విద్య కూడా ఒకరు. గ్లామరస్ బ్యూటీ దివి, హౌస్‌లో కాస్త డల్‌గానే కన్పిస్తున్నా, సోషల్ మీడియాలో ఆమెకి ఫాలోయింగ్ గట్టిగానే వున్నట్లు కన్పిస్తోంది. దివి తరఫున ఆమె బ్యాక్ ఎండ్ సపోర్ట్ టీవ్‌ు బాగా పనిచేస్తోంది. ఎప్పుడైతే ఎలిమినేషన్‌కి దివి నామినేట్ అయ్యిందో ఆ వెంటనే, అభిమానులు ఓటింగ్‌లో పెద్దయెత్తున ఆమెకు అనుకూలంగా ఓట్లేయడం మొదలు పెట్టారు. ఈ రోజు మధ్యాహ్నం సమయానికే దివి టాప్ ప్లేస్‌లో వుంది ఓటింగ్ పరంగా. అయితే, ఏడుగురి నుంచి ఒకరో ఇద్దరో సేఫ్ అవడానికి తగిన విధంగా టాస్క్‌ల రూపకల్పన కూడా జరిగే అవకాశం వుంది. సో, ఆ టాస్క్‌లతోనే దివి సేఫ్ అయిపోతుందనీ ఆమె అభిమానులు భావిస్తున్నారు. మరోపక్క, గంగవ్వకి బీభత్సమైన ఫాలోయింగ్ కన్పిస్తోంది సోషల్ మీడియాలో. నోయెల్, అలేఖ్య హారిక తదితరులకి చెందిన బ్యాక్ ఎండ్ టీవ్స్‌ు కూడా గంగవ్వకి అనుకూలంగా ఓట్లు వేయించేందుకు ప్రయత్నిస్తున్నాయట. అలా చేయడం ద్వారా ముందు ముందు గంగవ్వ సపోర్టర్స్, తమకు మద్దతుగా నిలుస్తారని వారంతా ఆశిస్తున్నారు. బిగ్‌హౌస్‌లో ఏ క్షణం ఎలాంటి షాకింగ్ ఘటనలైనా జరగొచ్చు, ఈక్వేషన్స్ కూడా మారిపోవచ్చు.