iDreamPost

Credit Cards:  ఓటీపీ నిబంధనల గడువు పొడిగించిన ఆర్బీఐ

Credit Cards:  ఓటీపీ నిబంధనల గడువు పొడిగించిన ఆర్బీఐ

వాటాదారుల విజ్ఞప్తి మేరకు ఆర్బీఐ ఇప్పుడు క్రెడిట్ కార్డుల పరిమితులకు సంబంధించిన నిబంధనలు మరో 3 నెలలు పొడిగించింది. దీని ద్వారా కార్డును యాక్టివేట్ చేసేందుకు ఓటీపీని తప్పనిసరి చేసే నిబంధనకు మరింత గడువు లభించింది.

బ్యాంకులు క్రెడిట్ కార్డును జారీ చేసిన తేదీ నుండి 30 రోజుల లోపు ఆ కార్డును యాక్టివేట్ చేసుకోవాలి. అలా కాని పక్షంలో కార్డును యాక్టివేట్ చేసేందుకు వన్ టైమ్ పాస్ వర్డ్ విధానాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ ఓటీపీ నిబంధనను తప్పనిసరి చేస్తూ నిబంధనలు జారీ చేసింది. ఇప్పుడు ఆ నిబంధనల్ని పొడిగిస్తూ అక్టోబర్ 1, 2022 నుంచి అమల్లోకి తేవాలని నిర్ణయించింది.

గతంలో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కార్డుల నిబంధనల్లో మార్పులపై 6 నెలల పొడిగింపు కోరింది. తాజాగా వచ్చిన అభ్యర్థనలతో మరో 3 నెలలు పోడిగిస్తున్నట్లు ఆర్బీఐ తాజా ప్రకటనలో తెలిపింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి