iDreamPost

ఉపాధ్యాయురాలి వినూత్న బోధన-సామాజిక మాధ్యమాలలో వైరల్

ఉపాధ్యాయురాలి వినూత్న బోధన-సామాజిక మాధ్యమాలలో వైరల్

ఉపాధ్యాయ వృత్తిపట్ల నిబద్ధతతో విలువలతో కూడిన విద్యాబోధన చేస్తూ వృత్తికి తమ జీవితాన్ని అంకితం చేసే వ్యక్తులు కొందరుంటారు. ఆ కోవకు చెందిన వ్యక్తే స్పెయిన్ కు చెందిన వెరోనికా డూకే.స్పానిష్ కు చెందిన ఈ ఉపాధ్యాయురాలు పదిహేనేళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ ఉంది. ఈ మధ్య ఆమె శరీర అంతర్గత భాగాలకు సంబంధించిన ఒక సూట్ ను ధరించి,పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు శరీర అంతర్భాగ అవయవాల గురించి అర్థం చేసుకునేందుకు తరగతి గదిలో బోధన చేసింది.

ఆమె తరగతి గదిలో శరీర అంతర్భాగాల సూట్ తో బోధన చేస్తుండగా ఆమె భర్త ఫోటోలు తీశారు.
డూకే వినూత్న బోధనతో కూడిన ఫోటోలను “విద్యార్థులకు పాఠాలు బోధించడానికి నా భార్య ఎంచుకున్న మార్గానికి ఎంతో గర్విస్తున్నా. నేడు ఆమె మానవ శరీరం గురించి బోధించింది. విద్యాబోధనకు ఇది ఎంతో మంచి మార్గం”అని ట్విట్టర్ లో ఆమె భర్త పేర్కొన్నారు.

పోస్ట్ చేసిన వెంటనే సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారి నెటిజన్లను ఈ ట్వీట్ ఎంతగానో ఆకర్షించింది.
కొద్ది క్షణాలలోనే ఈ ట్వీట్ ను 13 వేల మంది రీట్వీట్ చేయగా, 66 వేల మంది ఇష్టపడ్డారు.సామాజిక మాధ్యమాలలో తన బోధనలతో గుర్తింపు పొందిన వెరోనికా మాట్లాడుతూ “తాను విద్యార్థులకు అంతర్గత అవయవాల స్వభావాన్ని వివరించడానికి చేసిన ప్రయత్నం ఎంతో విలువైనదని” పేర్కొన్నారు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి