iDreamPost

పరిటాల కుటుంబం నుండి దేవాదాయ శాఖకు మారిన…

పరిటాల కుటుంబం నుండి దేవాదాయ శాఖకు మారిన…

అనంతపురం జిల్లాలోనే కాక కర్ణాటక రాష్ట్రంలోకూడా ప్రసిద్ధి చెందిన నసనకోట ముత్యాలమ్మ దేవాలయం ఎట్టకేలకు రాష్ట్ర దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చింది. గత 27 సంవత్సరాలుగా పరిటాల కుటుంబీకుల ఆధీనంలో ఉన్న ఈ దేవాలయానికి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం శుక్రవారం ఆలయ ఈవో గా బివి నర్సయ్య భాద్యతలు చేపట్టాడు.

పరిటాల కుటుంబం గత 25 సంవత్సరాలుగా ప్రజాప్రతినిధులుగా ఉండడంతో ఈ ఆలయం వారి ఆధీనం లోనే ఉంటూ వస్తుంది ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే 1992 నుండి పరిటాల కుటుంబీకులే దేవస్థాన చైర్మన్లుగా వ్యవహిస్తున్నారు. రోజు రోజుకి ఈ ఆలయానికి భక్తుల తాకిడి పెరుగుతుండడంతో ఆలయ పరిధిలోని దుకాణాల వేలంపాట, హుండీ, టెంకాయలు, వాహనాలు పార్కింగ్, గదుల బాడుగులు, మద్యం విక్రయం రూపంలో ఏడాది కి షుమారు 2 కోట్లకి పైగా వస్తుంది. ఇవికాక భక్తులు అమ్మవారికి కానుకలు రూపంలో సమర్పించే చీర సారెలు, బంగారు వెండి ఆభరణాలతో పాటు భారీ మొత్తంలో డబ్బులను చెక్కులను ఆలయకమిటీ చైర్మన్లకు అందజేశారని ఆ సొమ్మును కూడా పరిటాల కుటుంబం దండుకుంటుందని చాలారోజుల నుండి స్థానిక వైయస్సార్సిపి నాయకులు ఆరోపిస్తూ వస్తున్నారు.

ఈ ఆలయ కమిటీకి చర్మన్ గా మాజీ మంత్రి పరిటాల సునీతా తండ్రి కొండన్నతోపాటు పరిటాల కుటుంబం అనుచరులనే 19 మందిని కమిటీ సభ్యులుగా నియమించేవారు. ఆలయ విరాళాలను గ్రామస్థులకుగానీ కమిటీ సభ్యులకు గాని తెలియనిచ్చేవారు కాదని కేవలం 1 కోటి నుండి రెండు కోట్ల రూపాలును మాత్రమే ఆదాయంగా చూపేవారని విమర్శలున్నాయి. భక్తులు కానుకల రూపంలో ఇచ్చిన బంగారు వెండి ఆభరణాలను కర్ణాటక రాష్ట్రం కొత్తకోట లో విక్రయించేవారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.ఈ అంశంపై ఇప్పటికే పత్రికల్లో అనేక కథనాలు వచ్చాయి.

ఈ ఆలయ కమిటీని రద్దు చేయాలని గత కొన్నేళ్లుగా ప్రస్తుత శాసన సభ్యులు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశాన్ని గతంలో ఆయన అనేకసార్లు దేవాదాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకుపోయినా అధికారులు పట్టించుకొనేవారు కాదు. ఎట్టకేలకు ఆయన చేస్తున్న పోరాటానికి ప్రస్తుత వైయస్సార్సిపి ప్రభుత్వం స్పందించి రెండు నెలల క్రితం ఈ ఆలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకువచ్చి ఆనంద్ అనే అధికారిని ఈవో గా నియమించారు. ఆయన్ని కూడా బాధ్యతలు స్వీకరించకూడదని బెదిరించినట్టుగా ఆరోపణలొచ్చాయి

ఆలయం దేవాదాయ శాఖ పరిధిలోకి రావడంతో గత పాలకులు రికార్డులను బంగారు ఆభరణాల వివరాలను అందజేయాలని కమిటీ కి నోటీసులు అందజేసినట్టు నూతన ఈవో గా భాద్యతలు చేపట్టిన అననంతరం బివి నర్సయ్య మీడియాకి తెలియజేశారు. స్థానిక రామగిరి ఎస్సై నాగస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమానికి బందోబస్తు ఏర్పాట్లని పర్యవేక్షించారు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి