iDreamPost

సస్పెండ్ అయిన వివాదాస్పద నర్సీపట్నం డాక్టర్ సుధాకర్.

సస్పెండ్ అయిన వివాదాస్పద నర్సీపట్నం డాక్టర్ సుధాకర్.

తెలుగుదేశం నేత అయ్యన్న పాత్రుడు మనిషిగా ముద్ర పడ్డ నర్సీపట్నం వివాదాస్పద మత్తు డాక్టర్ సుధాకర్ ను సస్పెండ్ చేస్తు ఎట్టకేలకు వైద్య విధాన పరిషత్ కమీష్నర్ ఉత్తర్వులు జారీ చెసారు. కరోనా మహమ్మారి రాష్ట్రంలో తీవ్ర రూపందాల్చి ఉన్న ఈ సమయంలో వృత్తి ధర్మమాన్ని పక్కనపెట్టి వ్యక్తిగత స్వలాభం కోసం డాక్టర్లు, మాస్కులు కొరత ఉంది అంటు ఉన్నతాధికాలులు, పోలీసులు ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేసిన డాక్టర్ సుధాకర్, ఒక్కసారిగా వార్తల్లొ వ్యక్తిగా మారిపొయారు.

దీంతో రంగంలోకి దిగిన నర్సిపట్నం శాసన సభ్యులు ఉమాశంకర్ గణేష్ డాక్టరుకు అయ్యన్న పాత్రుడితో ఉన్న సత్సంబందాలు వీడియో రూపంలో బహిర్గతం చేశారు. అయ్యన్న పాత్రుడి ఆదేశాల మేరకే డాక్టర్ సుధాకర్ ప్రభుత్వంపై బురద జల్లే కార్యకరమం చేశారని చెప్పుకోచ్చారు. దీంతో స్పందించిన ప్రభుత్వం డాక్టర్ వ్యవహారాశైలి పై కలక్టర్ ఆదేశాలతో నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో విచారణ జరిపిన ఉన్నతాధికారులు నివేదికను తయారు చేశారు. అయితే నివేదిక ఆదారంగా తాజాగా వైద్య విధాన పరిషత్ కమీషనర్ డాక్టర్ సుధాకర్ ను సస్పెండ్ చేస్తు ఉత్తర్వులు జారీ చేశారు.

Also Read:- నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో టీడీపీ మార్క్ రాజకీయం

సస్పెన్షన్ తరువాత డాక్టర్ సుధాకర్ ఒక మీడియా ఛానల్ తో మాట్లాడుతు, తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉనట్టు చెప్పుకొచ్చారు. అయ్యన్న పాత్రుడితో తనకి ఉన్న సత్సంబంధాలని ఒప్పుకుంటూనే మరొక సారి నర్సీపట్నం శాశన్ సభ్యులు ఉమా శంకర్ గణేష్ పై విమర్శలు చేశారు. తాను విమర్శలు చేసే ముందే సస్పెండ్ అవుతానని ఊహించే విమర్శలు చేశానని చెప్పుకొచారు. అయితే విమర్శలకి ముందు తాను అయ్యన్న పాత్రుడి ఇంటికి వెళ్ళినట్టు, అయితే గంటకు పైగా అయ్యన్నను కలవటానికి ఎదురు చూసినా ఆయన కలవలేదని చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి