iDreamPost

ఇంత అహమేలా లోకేష్..?

ఇంత అహమేలా లోకేష్..?

రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు.. సవాళ్లు ప్రతి సవాళ్లు నడుస్తూనే ఉంటాయ్. ఎన్ని ఆరోపణలు చేసిన ఒక పరిమితి అంటూ ఉంటుంది. ఆ పరిమితి దాటితే ఎదురయ్యే పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. విమర్శలు ఎంత హుందాగా ఉంటే అంత మంచిది సదరు నాయకులకు.

కానీ, అందరిదీ ఒక దారైతే లోకేష్ ది మరోదారి. తండ్రిని అడ్డుపెట్టుకుని, ఎలెక్షన్లో పోటీనే చేయకున్నామూడు శాఖలకు మంత్రిగా కూడా చేశాడు. కానీ, ఏం లాభం విషయ పరిజ్ఞానం తక్కువ… నోరు జారడం ఎక్కువ. తరచుగా తన అజ్ఞానాన్ని తనే బయట పెట్టుకునే లోకేష్.. తిరుపతి ఉప ఎన్నికల్లోనూ అదే ట్రెండ్ కొనసాగిస్తున్నారు.

టీడీపీ ఎంపీ గెలిస్తే గ్యాస్, పెట్రోల్ ధరలు తగ్గుతాయంటా..! వింటున్న మనకే నవ్వొస్తున్నా ఆయన మాత్రం తన అజ్ఞానాన్ని ప్రదర్శించుకోవడం ఆపడు. తన అజ్ఞానాన్ని అందరూ ఎత్తి చూపుతూ, గేలి చేస్తుండడంతో హద్దులు దాటి వ్యక్తి గత విమర్శలకు లోకేష్ పూనుకున్నారు. కాళ్లు పట్టుకునే వ్యక్తి కావాలో లేక కాలర్ పట్టుకొని ప్రశ్నించే నాయకులు కావాలో తేల్చుకోవాలని ఓటర్లకు చెప్తున్నాడు.

వైసీపీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తి స్వతహాగా వైద్యుడు. ఫిజియోథెరఫిస్ట్ గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాధించారు. వైఎస్ షర్మిల పాదయాత్రలో ఆమెకు వ్యక్తిగత ఫిజియో గా పనిచేశారు. అసలు ఫిజియోథెరఫిస్ట్ అంటేనే నొప్పుల నుంచి ఉపశమనం కలిగించడం. ఆయన వృత్తిలో భాగంగా కాళ్లకు కూడా థెరపీ చేయాల్సిందే. దీన్ని పట్టుకొని ఒక ఎంపీ అభ్యర్థిని కాళ్లు పట్టుకునే వ్యక్తి అంటూ వెకిలి కామెంట్స్ చేయడం లోకేష్ కే చెల్లింది. పూర్తి అహంకారభావంతో లోకేష్ చేస్తున్న విమర్శలు టీడీపీ కొంపనే ముంచుతాయనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

Also Read : తిరుపతి ఉప ఎన్నికకు మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాళ..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి