iDreamPost

‘హాయ్ నాన్న’.. మరో క్లాసిక్ మూవీ రెడీ చేస్తున్న నాని! గ్లింప్స్ వైరల్!

  • Author ajaykrishna Updated - 12:04 PM, Thu - 13 July 23
  • Author ajaykrishna Updated - 12:04 PM, Thu - 13 July 23
‘హాయ్ నాన్న’.. మరో క్లాసిక్ మూవీ రెడీ చేస్తున్న నాని! గ్లింప్స్ వైరల్!

నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ టైటిల్ కోసం ఫ్యాన్స్ ఎంతలా ఎదురు చూస్తున్నారో తెలిసిందే. ఎట్టకేలకు ఈరోజు టైటిల్ తో పాటు వీడియో గ్లింప్స్ కూడా రిలీజ్ చేసి సర్ప్రైజ్ చేశారు మేకర్స్. నాని సినిమా అంటేనే.. ప్రేక్షకులలో మినిమమ్ అంచనాలు ఉంటాయి. అలాంటిది ఫస్ట్ అనౌన్స్ మెంట్ వీడియోతోనే అటెన్షన్ క్రియేట్ చేశాడు నాని. అది వినగానే అందరికీ ఈ సినిమా ఓ తండ్రి, కూతురుకు మధ్య ఉండబోతుందని అర్థమైంది. కానీ.. టైటిల్ ఏం పెడతారు? అనే సస్పెన్స్ అందరిలోనూ నెలకొంది. పైగా ఈ సినిమాలో నాని సరసన ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్.. మ్యూజిక్ డైరెక్టర్ గా ‘హృదయం’ ఫేమ్ హేషం అబ్దుల్ వాహబ్.

ఇవే పెద్ద సర్ప్రైజ్ అనుకుంటే.. ఈ సినిమా నానికి ముచ్చటగా 30వది కావడం విశేషం. అందులోనూ ఫాదర్ క్యారెక్టర్ లో నాని ఇరగ్గొట్టేస్తాడు.. ఆల్రెడీ జెర్సీ మూవీతో ప్రూవ్ చేసేసాడు. ఇంకేముంది.. ఈ మధ్య నాని కొత్త దర్శకులను ఎక్కువగా ప్రోత్సాహిస్తున్నాడు. శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి.. చివరిగా దసరా. ఇవన్నీ బాగా అనుభవం ఉన్న డైరెక్టర్స్ తీయలేదు. కానీ.. ఫ్రెష్ కంటెంట్ బయటికి వచ్చింది. ఇప్పుడు అదే బాటలో తన 30వ సినిమాతో శౌర్యువ్ అనే కొత్త డైరెక్టర్ ని పరిచయం చేస్తున్నాడు నాని. కాగా.. ఈ సినిమాకు “హాయ్ నాన్న” అనే టైటిల్ ని ఖరారు చేశారు. దీనికి సంబంధించి తాజాగా టైటిల్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్.

నాని నుండి ‘హాయ్ నాన్న’ అనే టైటిల్ చూసేసరికి.. మరో క్లాసిక్ రెడీ చేస్తున్నాడని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. పైగా రిలీజ్ చేసిన గ్లింప్స్ కూడా చాలా ఇంటరెస్టింగ్ గా ఉండటం మరో ప్లస్. ఈ వీడియో కూడా సినిమాలో నానిని తన కూతురు హీరోయిన్ మృణాల్ కి పరిచయం చేస్తున్నట్లుగా చూపించారు. దానికి హేషమ్ అబ్దుల్ వాహబ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చక్కగా కుదిరింది. డెబ్యూ డైరెక్టర్ అయినప్పటికీ.. శౌర్యువ్ మూవీని తండ్రి- కూతురు మధ్య ఎమోషనల్ బాండింగ్ నేపథ్యంలో చూపించబోతున్నాడేమో అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో నానికి కూతురుగా కియారా ఖన్నా అనే పాప నటిస్తోంది. మరి నాని మూవీకి హాయ్ నాన్న అనే టైటిల్ ఎలా ఉందో మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి