iDreamPost

తెలంగాణ అసెంబ్లీలో మారుమ్రోగిన YSR పేరు! ఇది కదా క్రేజ్!

YSR Name in Telangana Assembly: మరణించి ఏళ్లు గడిచిన ప్రజల గుండెల్లో చిరంజీవిగా ఉన్న నేత ఉమ్మడి ఏపీ సీఎం, దివంగత నేత వైఎస్సార్. తాజాగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఆయన పేరు మార్మోగింది. పార్టీలకు అతీతంగా అందరూ ఆయన పేరున ప్రస్తావిస్తూ ప్రసంసించారు.

YSR Name in Telangana Assembly: మరణించి ఏళ్లు గడిచిన ప్రజల గుండెల్లో చిరంజీవిగా ఉన్న నేత ఉమ్మడి ఏపీ సీఎం, దివంగత నేత వైఎస్సార్. తాజాగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఆయన పేరు మార్మోగింది. పార్టీలకు అతీతంగా అందరూ ఆయన పేరున ప్రస్తావిస్తూ ప్రసంసించారు.

తెలంగాణ అసెంబ్లీలో మారుమ్రోగిన YSR పేరు! ఇది కదా క్రేజ్!

వైఎస్సాఆర్.. ఇది ఒక పేరు కాదు.. ఒక బ్రాండ్. చరిత్రలోకి ఎంతో మంది ఎక్కుతుంటారు. కానీ కొందరు మాత్రమే చరిత్రలో తమకంటూ ఒక పేజిని లిఖించుకుంటారు. అలాంటి వారిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒకరు. చాలా మంది ప్రజలకు సాయం చేసి.. బతికుండగా దేవుళ్లుగా కనిపిస్తారు. కానీ కొందరే వారు చేసిన పనులతో చనిపోయిన తరువాత కూడా దేవుడిగా మారుతారు. అలాంటి వారే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన చనిపోయిన 14 ఏళ్లు అయినా తెలుగు ప్రజల గుండెల్లో చిరంజీవిగా, దేవుడిగా నే ఉన్నారు. నేటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో వైఎస్సార్ పేరు వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో వైఎస్సార్ పేరు మారుమోగింది.

లీడర్ అంటే తాను ఎదుగుతూ తోటివారు ఎదిగేందుకు సాయ పడేవాడే. చాలా మంది నేతలు తమ కింద వారిని తొక్కేసి తాము లీడర్లుగా ఎదుగుతారు. అందుకే వాళ్ల కోసం పరితపించే వారు  అసలు ఉండరు. కానీ రాజశేఖర్ రెడ్డి వ్యక్తితం  చాలా భిన్నమైనది. తనతోటి వారిని రాజకీయం ఎదిగేందుకు ఎంతో సాయం చేస్తారు. అందుకే నేటికీ  రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలా మంది నేతలు వైఎస్సార్ అంటే ఎనలేని అభిమానం చూపిస్తుంటారు. ఆయన కోసం పదవులు త్యాగం చేసిన వారు కూడా ఎందరో ఉన్నారు. అలా ఎంతో మంది నేతల గుండెల్లో రాజశేఖరుడు దేవుడిగా నిలిచారు. ఇక కేవలం రాజకీయ నాయకులకే కాకుండా.. ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టి ప్రజలకు దేవుడయ్యారు.

ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్, జలయజ్ఞం, రైతులకు ఉచిత కరెంట్ వంటి పథకాలను  ప్రవేశపెట్టారు. ఈ పథకాలు అమలు చేయడం అసాధ్యమని అప్పటి ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి. అయితే అసాధ్యమైన పనులను సుసాధ్యం చేసి.. ప్రజల గుండెల్లో వైఎస్సార్ నిలిచిపోయారు. వైఎస్సార్ పేరు చెప్పుకుని గెలిచిన నేతలు ఎందరో ఉన్నారు. ఇక ఆయన కుమారుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అయితే ఏకంగా ఆయన పేరుతో పార్టీని స్థాపించి.. 2019 అధికారంలోకి వచ్చారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో నేటికి వైఎస్సార్ పేరు వినిపిస్తూనే ఉంటుంది. పార్టీలకు అతీతంగా ఆయనను ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిగిన ప్రతిసారీ వైఎస్సార్ పేరు వినిపిస్తూనే ఉంటుంది. గతంలో సీఎంగా పని చేసిన కేసీఆర్ కూడా వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలను, ఆయన వ్యక్తిత్వాన్ని అసెంబ్లీ సాక్షిగా ప్రశంసించారు. తాజాగా తెలంగాణలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆయన పేరుతోనే అధికారంలోకి వచ్చిందనడంలో అతిశయోక్తికాదు. నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలిసారిగా జరుగుతున్న సమావేశాల్లో వైఎస్సార్ పేరు మారుమోగింది. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు వైఎస్ రాజశేఖర్ రెడ్డిని గుర్తు చేసుకున్నారు. సీపీఎం నేతలు, ఎంఐఎం నేతలు, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ.. ఇలా అసెంబ్లీలోని అన్ని పార్టీలు వైఎస్సార్ పేరును ప్రస్తావించాయి.

కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.. వైఎస్సార్ గురించి ప్రశంసించారు. వైఎస్సార్ ఒక్కరే అసాధ్యమనుకున్న పనులను సుసాధ్యం చేశారని ఆయన తెలిపారు. నాడు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన హామీలను అన్నింటినీ నెరవేర్చారని ప్రశంసించారు. అప్పుడు జలయజ్ఞానికి నిధులు వాటంతట అవే సమకూరాయని తెలిపారు. హామీలను నెరవేర్చడానికి డబ్బులు ఇబ్బంది కాదని గుర్తించాలన్నారు. వైఎస్సార్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, కమిట్మెంట్ తో పని చేశారని కూనంనేని చెప్పుకొచ్చారు. అలానే ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కూడా వైఎస్సార్ ను కీర్తించారు.

ఆయన కారణంగానే తాము కాంగ్రెస్ తో సానిహిత్యం పెంచుకున్నామని అక్బరుద్దీన్ తెలిపారు. వైఎస్సార్ హాయంలోనే మైనార్టీలకు న్యాయం జరిగిందని తెలిపారు. ముస్లిం సమస్యల కోసం ఆయన పోరాడారని, 4 శాతం ఇప్పించిన ఘనత వైఎస్సార్ ఇది అని అక్బరుద్దీన్ తెలిపారు. ఇలా అన్ని పార్టీల నేతలు శనివారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో దివంగత నేత, డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి  మారుమోగింది. మరణించిన ఏళ్లు గడుస్తున్న.. వైఎస్సార్ పేరు నిత్యం వినిపిస్తూనే ఉంది. బహుశా.. ఇలాంటి అదృష్టం కోట్లలో ఒకరో ఇద్దరికో దక్కుతుందేమో. మరి.. ఇలా తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో వైఎస్సార్ పేరు మారు మోగడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి