iDreamPost

నాగ్.. ‘నా సామిరంగ’ ఆ మలయాళం మూవీకి రీమేకా..?

  • Author ajaykrishna Updated - 11:20 AM, Wed - 30 August 23
  • Author ajaykrishna Updated - 11:20 AM, Wed - 30 August 23
నాగ్.. ‘నా సామిరంగ’ ఆ మలయాళం మూవీకి రీమేకా..?

టాలీవుడ్ కింగ్ నాగార్జున సోలో హిట్ కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఎప్పటికప్పుడు కథలతో కొత్త ప్రయోగాలు చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరుస్తూ వస్తున్నాయి. గతేడాది బిగ్ హైప్ తో విడుదలైన ఘోస్ట్ కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో నాగ్ ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు.. ఫ్యాన్స్ కూడా అదే కోరుకుంటున్నారు. ఈ క్రమంలో కాస్త గ్యాప్ తీసుకొని మరి కొత్త సినిమా అనౌన్స్ చేశాడు నాగ్. ఈ సినిమాకు ‘నా సామిరంగ’ అనే మాస్ టైటిల్ ని ఫిక్స్ చేశారు. తాజాగా టైటిల్ తో పాటు నాగ్ ఫస్ట్ లుక్ కి సంబంధించి గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్.

పంచకట్టు.. బీడీ.. మాస్ లుక్ లో నాగ్ గూస్ బంప్స్ తెప్పించేశాడు. దీంతో ఈసారి మాస్ బొమ్మతో హిట్టు ఖాయం అనే ఫీల్ ఫ్యాన్స్ లో కలిగింది. అయితే.. నా సామిరంగా మూవీతో డాన్స్ మాస్టర్ విజయ్ బిన్ని.. దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాకు కథ, మాటలను రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ అందించడం జరిగింది. అయితే.. నాగార్జున కెరీర్ లో 99వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీ వర్గాలలో వైరల్ గా మారింది. అదేంటంటే.. సీనియర్ హీరోల నుండి ఎలాంటి కొత్త సినిమాలు అనౌన్స్ అయినా.. వెంటనే అవి కొత్త కథలా లేక రీమేక్ లా అని ఆరా తీస్తుంటారు నెటిజన్స్.

nagarjuna new movie is reamake 3

ఇప్పుడు నా సామిరంగ విషయంలోను అదే చేశారట. తాజా సమాచారం ప్రకారం.. నా సామిరంగా ఓ మలయాళం సూపర్ హిట్ సినిమాకు రీమేక్ అని తెలుస్తోంది. అధికారికంగా మేకర్స్ ప్రకటించలేదు. కానీ.. దాని రీమేకే అని అంటున్నాయి పలు కథనాలు. 2019లో విడుదలైన ‘పోరింజు మరియం జోస్’ (Porinju Mariam Jose) అనే మలయాళం సినిమా దీనికి స్ఫూర్తి అని అంటున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఆ సినిమా.. కేరళలోని యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందింది. ముగ్గురు స్నేహితుల చుట్టూ ఆ కథ సాగుతుంది. మరి నా సామిరంగా ఒకవేళ దానికి రీమేక్ అయితే ఎలాంటి మార్పులు చేశారో తెరపైకి వస్తేనే తెలుస్తుంది. అయితే.. ఇది రీమేక్ అని మాత్రం ఇప్పటిదాకా కన్ఫర్మ్ కాలేదు. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరినేది ఇంకా తెలియాల్సి ఉంది. మరి నా సామిరంగ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

nagarjuna new movie is reamake 4

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి