iDreamPost

తెలంగాణ ప్రభుత్వం, కేటీఆర్‌పై నాగార్జున ప్రశంసలు

  • Published Nov 02, 2023 | 12:51 PMUpdated Nov 02, 2023 | 12:51 PM

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత అభివృద్ధి పథంలో దూసుకుపోతూ.. అందరి ప్రశంసలు అందుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా నాగార్జున తెలంగాణ ప్రభుత్వం, కేటీఆర్‌ మీద ప్రశంసలు కురిపించారు. ఆ వివరాలు..

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత అభివృద్ధి పథంలో దూసుకుపోతూ.. అందరి ప్రశంసలు అందుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా నాగార్జున తెలంగాణ ప్రభుత్వం, కేటీఆర్‌ మీద ప్రశంసలు కురిపించారు. ఆ వివరాలు..

  • Published Nov 02, 2023 | 12:51 PMUpdated Nov 02, 2023 | 12:51 PM
తెలంగాణ ప్రభుత్వం, కేటీఆర్‌పై నాగార్జున ప్రశంసలు

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత.. అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతంది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ప్రాజెక్ట్‌ల నిర్మాణం, మౌలిక సదుపాయల కల్పన, పరిశ్రమలు ఇలా అన్ని రంగాల్లో మెరుగైన అభివృద్ధి సాధిస్తూ.. దేశంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో ఉంది. ఈ తొమ్మిదేళ్ల కాలంలో తెలంగాణలో అన్ని రంగాల్లో అభివృద్ధి వెల్లివిరుస్తోంది. ఇక బడా సంస్థలన్ని తమ వ్యాపార విస్తరణ కోసం తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు క్యూ కడుతున్నాయి. ఇందుకు కారణం ఇక్కడ అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం. కంపెనీల స్థాపనకు అనువైన వాతావరణాన్ని కల్పించాయి. వాటికి కావాల్సిన అన్ని సౌకర్యాలు, సదుపాయాలు కల్పించి.. పెట్టుబడులకు హైదరాబాద్‌ బెస్ట్‌ అనుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా హీరో నాగార్జున కేటీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. ఆ వివరాలు..

హైదరాబాద్ నోవాటెల్‌లో ఏర్పాటు చేసిన సినిమాటిక్ ఎక్స్‌పోను ప్రారంభించారు నాగార్జున. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ టెక్నాలజీ ఉపయోగించుకొని టాలీవుడ్ ఆస్కార్ స్థాయికి ఎదగడం ఆనందంగా ఉందన్నారు. ప్రస్తుతం భారతదేశం మొత్తం.. సౌత్‌ ఇండియా సినిమాలనే ఫాలో అవుతున్నారని తెలిపాడు హైదరాబాద్ అనేది సినిమా పరిశ్రమకు క్యాపిటల్‌గా మారనుందన్నారు.

హైదరాబాద్‌ ఇంతలా అభివృద్ధి సాధించడానికి కారణమైన తెలంగాణ ప్రభుత్వానికి, ఐటీ మంత్రి కేటీఆర్, ఐటీ డిపార్ట్‌మెంట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్‌కు ఈ సందర్భంగా ధన్యావాదాలు తెలిపారు నాగార్జున. ఇండియా జాయ్, ఫ్లయింగ్ మౌంటెయిన్ కాన్సెప్ట్స్ సమర్పణలో ఈ సినిమాటిక్ ఎక్స్ పో కార్యక్రమం జరిగింది. సినీమా రంగంలో 24 శాఖల్లో వచ్చిన సరికొత్త సాంకేతికతను ఈ సినిమాటిక్ ఎక్స్‌పోలో ప్రదర్శనకు ఉంచారు.

తెలంగాణ ప్రభుత్వం సినిమా రంగానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తోన్న సంగతి తెలిసిందే. సినిమా టికెట్‌ రేట్ల పెంపు మొదలు.. షోల సంఖ్య పెంచే వరకు అన్ని విధాలుగా ఇండస్ట్రీకి మద్దతుగా నిలుస్తోంది తెలంగాణ ప్రభుత్వం. దీనిపై ఇప్పటికే అనేక మంది సినీ ప్రముఖులు.. ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించడమే కాక ధన్యవాదాలు కూడా తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి