iDreamPost

చింతలపూడి ఎత్తిపోతల పథకానికి 1931 కోట్లు – నాబార్డు సంస్థ

చింతలపూడి ఎత్తిపోతల పథకానికి 1931 కోట్లు – నాబార్డు సంస్థ

కృష్ణా, పచ్చిమ గోదావరి జిల్లలను సస్యస్యామలం చెసే చింతలపూడి ఎత్తిపోతల పథకానికి 1931 కోట్లు ఆర్ధిక సాయం అందిస్తునట్టు నాబార్డు సంస్థ ప్రకటించింది. కృష్ణా పచ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్న 33 మండల్లాల్లో మొత్తం 4.80 లక్షల ఎకరాలకు సాగునీరు అలాగే 410 గ్రామాల్లోని 26 లక్షల మందికి తాగునీరు అందించాలనే లక్ష్యంతో 2008 అక్టోబర్ 30న శంకుస్తాపన చెసినా, వై.యస్ మరణానంతరం పనులు మందకోడిగా సాగాయి.

2019 ఎన్నికల నాటికి కేవలం 20శాతం పనులు మాత్రమే జరిగాయి అని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే వై.యస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నీటి ప్రాజెక్టుల పూర్తికి ప్రత్యక దృష్టి పెట్టి పనులు వేగంగా జరిగేలా చర్యలు చెపట్టారు, ఎన్నో రోజులుగా రెండుజిల్లాల మెట్ట ప్రాంత రైతులు ఏదురు చూస్తున్న చింతలపూడి ఎత్తిపోతల పథకానికి నేడు నాబార్డు అందించిన ఆర్ధిక సాయంతో త్వరలోనే ఆ ప్రాంత రైతుల కల సాకారం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి