iDreamPost

మను డైరెక్టర్ తో మైత్రీ మూవీ మేకర్స్ కొత్త సినిమా

  • Published Feb 14, 2024 | 10:57 AMUpdated Feb 14, 2024 | 12:03 PM

సృజనాత్మకతకు పెద్దపీట వేసిన సినిమాలు మంచి పేరు తెచ్చుకుంటాయి. మను సినిమాతో గొప్ప క్రేజ్ సంపాదించాడు యువ దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి.

సృజనాత్మకతకు పెద్దపీట వేసిన సినిమాలు మంచి పేరు తెచ్చుకుంటాయి. మను సినిమాతో గొప్ప క్రేజ్ సంపాదించాడు యువ దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి.

  • Published Feb 14, 2024 | 10:57 AMUpdated Feb 14, 2024 | 12:03 PM
మను డైరెక్టర్ తో మైత్రీ మూవీ మేకర్స్ కొత్త సినిమా

ఆరేళ్ల విరామం తర్వాత మరోసారి మను సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి పై అందరి దృష్టి పడింది. ప్రముఖ పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రేమికుల రోజు సందర్భంగా ఈ యువ దర్శకుడితో కొత్త ప్రాజెక్టును ప్రారంభించింది. నిజానికి నిన్న రాత్రి తమ సోషల్ మీడియాలో వాలెంటైన్స్ డే సందర్భంగా ఒక సర్ప్రైజ్ ఇస్తాం అని ప్రకటించారు. అది చూసి సినీ ప్రేమికులు అందరూ ఏదో భారీ సినిమా అనౌన్స్ మెంట్ ఉంటుంది అమో అనుకున్నారు. అయితే వారి అంచనాలకు భిన్నంగా ఒక యూత్ ఫుల్ ప్రాజెక్ట్ ను ప్రారంభించారు మైత్రీ బృందం.

ఈ సినిమాకు టైటిల్ 8 వసంతాలు. 8 సంవత్సరాలకు పైగా సాగే ఆకర్షణీయమైన రొమాంటిక్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఫణీంద్ర నర్సెట్టి సృజనాత్మక నైపుణ్యం టైటిల్ తో పాటు పోస్టర్ రెండింటిలోనూ కనిపిస్తుంది. ఆసక్తికరమైన టాగ్ లైన్ కూడా ఉంది: “365 రోజులను అంకెలతో కొలిస్తే ఒక సంవత్సరం… అదె అనుభవాలతో కోలిస్తే, ఒక వసంతం”. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్, పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇతర తారాగణం, సాంకేతిక సిబ్బందికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

తెలుగు సినిమా పరిశ్రమలో గత కొన్నేళ్లలో పెద్ద ప్రొడక్షన్ బ్యానర్ గా ఎదిగిన మైత్రీ మూవీస్ గ్రూప్ బాలీవుడ్, కోలీవుడ్ లకు కూడా విస్తరిస్తోంది. ఇప్పటికే కోలీవుడ్ లోకి ప్రవేశించి మార్క్ ఆంథోని ఫేమ్ ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో స్టార్ హీరో అజిత్ తదుపరి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సమ్మర్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని, మైత్రీ మూవీస్ ఇప్పటికే చెన్నైలో తమ కార్యాలయాన్ని ప్రారంభించిందని సమాచారం. కేవలం సినిమాలు నిర్మించడం మాత్రమే కాకుండా డిస్ట్రిబ్యుషన్ లోకి కూడా అడుగు పెట్టారు. గత సంవత్సరం సంక్రాంతి సందర్భంగా తమ సొంత సినిమాలైన వాల్తేరు వీరయ్య, వీరసింహరెడ్డి సినిమాలతో పంపిణీ రంగంలోకి అడుగు పెట్టారు మైత్రీ మూవీస్ గ్రూప్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి