iDreamPost

Hansika: OTTలోకి వచ్చేసిన హన్సిక కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

  • Published Dec 29, 2023 | 10:42 AMUpdated Dec 29, 2023 | 10:42 AM

ఈ మద్య థియేటర్లలో కొత్త సినిమాలు చూడని వారికి వరంగా మారింది ఓటీటీ ఫ్లాట్ ఫామ్. ఇండియన్ మూవీస్ మాత్రమే కాదు.. ఇతర భాషా చిత్రాలు సైతం ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. వాటితో పాటు ఇంట్రెస్టింగ్ వెబ్ సీరీస్ లు కనువిందు చేస్తున్నాయి.

ఈ మద్య థియేటర్లలో కొత్త సినిమాలు చూడని వారికి వరంగా మారింది ఓటీటీ ఫ్లాట్ ఫామ్. ఇండియన్ మూవీస్ మాత్రమే కాదు.. ఇతర భాషా చిత్రాలు సైతం ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. వాటితో పాటు ఇంట్రెస్టింగ్ వెబ్ సీరీస్ లు కనువిందు చేస్తున్నాయి.

  • Published Dec 29, 2023 | 10:42 AMUpdated Dec 29, 2023 | 10:42 AM
Hansika: OTTలోకి వచ్చేసిన హన్సిక కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఒకప్పుడు శుక్రవారం వస్తుందంటే థియేటర్లలో కొత్త సినిమాలు సందడి చేస్తుంటాయని అనేవారు.. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. శుక్రవారం వస్తుందంటే ఓటీటీలో కొత్త సినిమాల సందడి మొదలవుతుంది. ఒక్క దేశీయ సినిమాలు మాత్రమే కాదు ఇతర భాషా చిత్రాలు, వెబ్ సీరీస్ కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి. కొత్త సినిమాలు థియేటర్లో చూడటం మిస్ అయిన వారు హ్యాపీగా ఇంట్లో కూర్చొని చూసే అవకాశం లభిస్తుంది. కరోనా తర్వాత ఓటీటీ లో సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేయడం ఎక్కువ అయ్యింది. అందుకే దేశంలో ఓటీటీకీ చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. కొంతమంది మూవీ మేకర్స్ కూడా ఓటీటీలోనే సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఓటీటీ ప్రేక్షకుల కోసం ఓ తెలుగు సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ సెలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. వివరాల్లోకి వెళితే..

హన్సిక ఈ పేరు కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి అల్లు అర్జున్ నటించిన దేశముదురు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. వరుసగా స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేస్తూ అక్కడే సెటిల్ అయ్యింది. గత నాలుగేళ్లుగా హన్సిక విరామం తీసుకుంది. తాజాగా ‘మై నేమ్ ఈజ్ శృతి’అనే తెలుగు మూవీలో నటించింది. నవంబర్ 17న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఈ మూవీలో హన్సిక నటన చాలా అద్భుతంగా ఉందని రెస్పాన్స్ వచ్చినా.. సినిమా పెద్దగా ఆడలేదు.

ఈ మూవీ నెలన్నర తర్వాత సైలెంట్ గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఇక సినిమా కథ విషయానికి వస్తే… ఓ యాడ్ ఏజెన్సీలో పనిచేస్తున్న శృతి అనే యువతి అనుకోకుండా ఓ మాఫియా వలలో చిక్కుకుంటుంది.. శృతి మాఫియాను ఎదుర్కొవడానికి ఎలాంటి ప్లాన్స్ వేస్తుంది.. ఎలా వాళ్లతో పోరాటం చేస్తుందీ అనేది తెరపై చాలా అద్భుతంగా చూపించారు. ఈ మూవీపై హన్సిక భారీ అంచనాలే వేసుకుంది.. కానీ పెద్దగా సక్సెస్ కాలేదు. శ్రీనివాస్ ఓంకార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. హన్సిక, ప్రేమ, మురళి శర్మ, నరేన్, పూజా రామచంద్రన్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ మూవీ థియేటర్లోల మిస్ అయిన వాళ్లు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయవొచ్చు. థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడేవారికి ‘మై నేమ్ ఈజ్ శృతి’బాగానే నచ్చుతుందని అంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి