iDreamPost

వీడియో: మతసామరస్యం వెల్లివిరిసిన వేళ.. శివుడికి పూజలు చేసిన ముస్లిం మహిళలు

మరోసారి గంగా జమునా తెహజీబ్ కు ప్రతీకగా తెలంగాణ నిలిచింది. ముస్లిం మహిళలు శివాలయానికి చేరుకుని కైలాస వాసుడికి పరమ భక్తితో పూజలు నిర్వహించారు.

మరోసారి గంగా జమునా తెహజీబ్ కు ప్రతీకగా తెలంగాణ నిలిచింది. ముస్లిం మహిళలు శివాలయానికి చేరుకుని కైలాస వాసుడికి పరమ భక్తితో పూజలు నిర్వహించారు.

వీడియో: మతసామరస్యం వెల్లివిరిసిన వేళ.. శివుడికి పూజలు చేసిన ముస్లిం మహిళలు

భారత దేశం సర్వ మతాలకు పుట్టినిల్లు. ఇక్కడ అన్ని మతాలు సమానమే. మనమంతా మనుషులం. ఎవరికి నచ్చిన మతాన్ని వారు స్వీకరించే స్వాతంత్య్రం ఉంది. కానీ నేటి రోజుల్లో కొందరు మతాన్ని అడ్డుపెట్టుకుని గొడవలు చెలరేగేలా ప్రేరేపిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మానవత్వమే మతంగా భావించి ఆపదలో ఉన్న వారికి అండగా నిలబడాలి. తమ మతానికే చెందిన దేవుడే గొప్ప అనుకునేదానికంటే సృష్టిలో దైవం ఒక్కటే అని భావించడం మేలు. ఈ క్రమంలో గంగా జమునా తెహజీబ్ కు ప్రతీకగా నిలిచారు ఈ ముస్లిం మహిళలు. మతసామరస్యం వెల్లివిరిసిన వేళ శివాలయంలో ముస్లిం మహిళలు పూజలుచేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.

తెలంగాణలో మతసామరస్యం వెల్లివిరిసింది. మతం అనే అడ్గుగోడను చీల్చుకుని ముస్లిం మహిళలు పరమశివుడికి పూజలు నిర్వహించారు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ – అచ్చంపేట మండలం రంగాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ గ్రామంలోని కొంతమంది ముస్లిం మహిళలు అక్కడున్నటువంటి నిరంజన్ షావలి దర్గాను దర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం స్థానికంగా ఉన్నటువంటి ఉమామహేశ్వర కొండకు వెళ్లి శివుడికి ప్రత్యేక పూజలు చేశారు. శివాలయానికి చేరుకున్న ముస్లిం మహిళలు గర్భ గుడిలో ఉన్నటువంటి శివలింగానికి గంగా జలంతో అభిషేకం చేశారు.

ఆ తర్వాత తమ కష్టాలను బాపి అష్టైష్వర్యాలు ప్రసాదించమని కైలాసవాసుడిని రెండు చేతులు జోడించి నమస్కరించి వేడుకున్నారు. దీనికి సంబంధించిన దృష్యాలను ఈ వీడియోలో చూడొచ్చు. ఇక ముస్లిం మహిళలు శివాలయంలో పూజలు నిర్వహించడంపై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. మనిషులకు కావాల్సింది మానవత్వమని.. మతం కాదని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి భోలాశంకరుడికి ముస్లిం మహిళలు పూజలు చేసిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి