iDreamPost

ఫిబ్రవరి లో మున్సి’పోల్స్’

ఫిబ్రవరి లో మున్సి’పోల్స్’

పట్టణ పాలక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రాబోవు ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాకు వెల్లడించారు. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల పై ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. జనవరి లో పంచాయతీ ఎన్నికలు జరిపేందుకు చక చకా ఏర్పాట్లు చేస్తోంది. బ్యాలెట్లు ముద్రించాలని ఎన్నికల సంఘం నుంచి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు వచ్చాయి. ఈ నెలాఖరు లోపు బ్యాలెట్ ముద్రణ పూర్తి చేయనున్నారు. సర్పంచ్, వార్డు మెంబెర్ ఎన్నిక కోసం గులాబీ, తెలుపు బ్యాలెట్ ముద్రించనున్నారు.

మున్సిపల్ ఎన్నికలు ఏవిఎం విధానం లో జరగనున్నాయి. పార్టీ గుర్తులతోనే ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది జులై లో రాష్ట్రం లోని పురపాలక, నగరపాలక సంస్థల పాలక మండళ్ల పదవి కాలం ముగిసింది. అప్పటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది. ఇక పంచాయతీల పాలక మండళ్ల గడువు గత ఏడాది ఆగస్టు తోనే ముగిసింది. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం 20 నగర పంచాయతీలు, 74 మున్సిపాలిటీలు, 16 నగర పాలక సంస్థలు ఉన్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి