iDreamPost

MS Dhoni: ధోని విశ్వరూపానికి పరాకాష్ట.. ఆఖరి ఓవర్ మెునగాడు! ఈ లెక్కలు చూస్తే షాకే

తనను మించిన బెస్ట్ ఫినిషర్ ప్రపంచ క్రికెట్ లోనే లేడని లెక్కలతో సహా ప్రూవ్ చేస్తున్నాడు మహేంద్రసింగ్ ధోని. ఇక ఐపీఎల్ చరిత్రలో చివరి ఓవర్లో ధోని ఎన్ని పరుగులు చేశాడో తెలుసా? ఆఖరి ఓవర్లో మెునగాడు ధోని అని తెలిస్తే మీరు షాకౌతారు.

తనను మించిన బెస్ట్ ఫినిషర్ ప్రపంచ క్రికెట్ లోనే లేడని లెక్కలతో సహా ప్రూవ్ చేస్తున్నాడు మహేంద్రసింగ్ ధోని. ఇక ఐపీఎల్ చరిత్రలో చివరి ఓవర్లో ధోని ఎన్ని పరుగులు చేశాడో తెలుసా? ఆఖరి ఓవర్లో మెునగాడు ధోని అని తెలిస్తే మీరు షాకౌతారు.

MS Dhoni: ధోని విశ్వరూపానికి పరాకాష్ట.. ఆఖరి ఓవర్ మెునగాడు! ఈ లెక్కలు చూస్తే షాకే

ఐపీఎల్ 2024లో మహేంద్రసింగ్ ధోని చెలరేగిపోతున్నాడు. పాత ధోనిని గుర్తుచేస్తూ.. సిక్సులు, ఫోర్లతో ప్రత్యర్థి బౌలర్లకు వణుకుపుట్టిస్తున్నాడు. అదేంటి ఈ ఐపీఎల్ సీజన్ లో అతడు చేసింది కేవలం 57 రన్సే కదా? దానికే చెలరేగిపోతున్నాడని చెప్పాలా? అని కొంత మంది ప్రశ్నలను రేకెత్తించవచ్చు. అయితే మనం ఇప్పుడు ధోని ఆఖరి ఓవర్లో సృష్టించిన విధ్వంసం గురించి. చివరి ఓవర్ కు మెునగాడు ఎవరంటే? ధోనిని మించిన మరో బ్యాటర్ లేడనే చెప్పాలి. తనను మించిన బెస్ట్ ఫినిషర్ ప్రపంచ క్రికెట్ లోనే లేడని లెక్కలతో సహా ప్రూవ్ చేస్తున్నాడు. ఐపీఎల్ చరిత్రలో చివరి ఓవర్లో ధోని ఎన్ని పరుగులు చేశాడో తెలుసా?

ప్రపంచ క్రికెట్ లో బెస్ట్ ఫినిషర్ ఎవరంటే? అందరి నోట ఒక్కటే మాట.. మహేంద్రసింగ్ ధోని. 42 ఏళ్ల వయసులోనూ ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో దుమ్మురేపుతున్నాడు ఈ లెజెండ్. టోర్నీలో భాగంగా ఇటీవల ముంబైతో జరిగిన మ్యాచ్ లో చివరి ఓవర్లో బ్యాటింగ్ కు దిగిన ధోని.. కేవలం 4 బంతుల్లోనే 3 సిక్సర్లతో 20 రన్స్ చేశాడు. ఇక తాజాగా లక్నోతో జరిగిన మ్యాచ్ లోసైతం 9 బంతుల్లోనే 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 28 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో 20వ ఓవర్ లో తానెంత ప్రమాదకారో మరోసారి రుజువుచేశాడు. ఇక ఆఖరి ఓవర్లో తనను మించిన మెునగాడు లేడంటే అతిశయోక్తికాదు. ఈ గణాంకాలు చూస్తే.. మీరే నొరెళ్లబెడతారు.

ధోనికి ఐపీఎల్ లో మరే ఇతర క్రికెటర్లకు లేని రికార్డు ఉంది. ఐపీఎల్ చరిత్రలో చివరి అంటే 20వ ఓవర్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు ధోనినే. దీంతో పాటుగా ఆఖరి ఓవర్లో ఎక్కువ సిక్సులు కొట్టిన ప్లేయర్ కూడా మిస్టర్ కూల్ కావడం విశేషం. ఐపీఎల్ హిస్టరీలో చివరి ఓవర్లో మెుత్తం 313 బంతులు ఆడి.. 772 రన్స్ చేశాడు. ఇందులో 53 ఫోర్లు, 65 సిక్సర్లు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ 246.64గా ఉండగా.. ఈ 772 రన్స్ లో ఫోర్లు, సిక్సర్ల ద్వారానే 602 రన్స్ రాబట్టడం విశేషం. ఇక ప్రస్తుత సీజన్ లో కేవలం 16 బంతుల్లోనే చివరి ఓవర్లలో 57 పరుగులు పిండుకున్నాడు ధోని. ఈ గణాంకాలు చూస్తేనే తెలుస్తోంది ఆఖరి ఓవర్ కు మెునగాడు ధోనినే అని. దీంతో అతడు బ్యాటింగ్ కు దిగుతున్నాడు అంటేనే ప్రత్యర్థి బౌలర్లకు గుండెలు గుభేల్ మంటున్నాయి. మరి చివరి ఓవర్లో ధోని విశ్వరూపానికి పరాకాష్టగా నిలుస్తూ సృష్టిస్తున్న విధ్వంసంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి