iDreamPost

హైకోర్టు నోటీసులందుకున్న సోషల్‌ మీడియా కార్యకర్తలపై వైసీపీ స్టాండ్‌ ఇదే..!

హైకోర్టు నోటీసులందుకున్న సోషల్‌ మీడియా కార్యకర్తలపై వైసీపీ స్టాండ్‌ ఇదే..!

పార్టీ సోషల్‌ మీడియా కార్యకర్తలకు పూర్తిగా అండగా ఉంటామని వైసీపీ ముఖ్యనేత, ఎంపీ విజయసాయి రెడ్డి భరోసా ఇచ్చారు. హైకోర్టు నోటీసులు జారీ చేసిన 49, 44 మంది అందరూ తమ పార్టీ వారు అవ్వొచ్చు.. కాకపోనూవచ్చన్నారు. టీడీపీ తన పేరుపైనే ఫేక్‌ అకౌంట్లు పెట్టి పోస్టులు పెట్టిందన్నారు. ఏమైనా తమ పార్టీ సోషల్‌ మీడియాకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు.

సోషల్‌ మీడియాను గత ఐదున్నరేళ్లుగా తానే పర్యవేక్షిస్తున్నాని చెప్పిన విజయసాయిరెడ్డి.. ఇప్పుడు కూడా తానే అన్ని బాధ్యతలు తీసుకుంటున్నానని స్పష్టం చేశారు. కేసులు ఎదుర్కొంటున్న వారికి పార్టీ తరఫున భరోసా ఇస్తామన్నారు. కేసులు ఎదుర్కొన్నంత మాత్రాన వారు దోషులు అయినట్లు కాదన్నారు. తప్పు ఎవరు చేసిన శిక్షించమనే తాము కోర్టును కోరుతున్నామన్నారు. అదే సమయంలో తమ కార్యకర్తలు జైలుకు వెళ్లినా తాము అండగా ఉంటామన్నారు. గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి కూడా జైలుకు వెళ్లిన కార్యకర్తలకు అండగా ఉన్నారని గుర్తు చేశారు. జైలుకు వెళ్లి మరీ ఆయన వారిని పరామర్శించారని పేర్కొన్నారు. ఆయన లాగే తాము కూడా పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు.

పార్టీ సానుభూతిపరులు.. టీడీపీ కవ్విస్తే పోస్టులు పెట్టారే తప్పా సొంతంగా పెట్టలేదని విజయసాయి రెడ్డి అన్నారు. న్యాయ వ్యవస్థను కించపరచాలన్న ఉద్దేశం వైసీపీ కార్యకర్తలకు లేదని స్పష్టం చేశారు. న్యాయ వ్యవస్థపై గౌరవం ఉందన్నారు. గత ఐడేళ్లలో టీడీపీ కార్యకర్తలు చేసిన తప్పులు, పెట్టిన పోస్టులపై కేసులు పెడితే దేశంలో ఉన్న జైళ్లు కూడా సరిపోవని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి