iDreamPost

Mothers Day : ఈ సంవత్సరం మదర్స్ డే ఎప్పుడొచ్చిందో తెలుసా? దీని చరిత్ర తెలుసా?

Mothers Day : ఈ సంవత్సరం మదర్స్ డే ఎప్పుడొచ్చిందో తెలుసా? దీని చరిత్ర తెలుసా?

 

 

ప్రపంచంలో మనల్ని అత్యంత ఎక్కువగా ప్రేమించేది తల్లి ఒక్కటే. తల్లిప్రేమకి అంతం అనేది ఉండదు. మనం ఎన్ని తప్పులు చేసినా తల్లి ఒక్కటే క్షమించగలదు. కానీ మనం తల్లిని ఎంతవరకు గౌరవిస్తున్నాం. ఇటీవల కాలంలో చాలా మంది తమ తల్లితండ్రుల్ని పట్టించుకోవడం మానేశారు. తల్లిని గౌరవించడానికి ఒకరోజు పెట్టి కనీసం ఆ ఒక్కరోజైనా గౌరవించాలని భావించడంతో ఈ మదర్స్ డే పుట్టుకొచ్చింది.

మదర్స్ డేకి ఒక నిర్దిష్ట తేదీ లేదు. ప్రతి సంవత్సరం మే రెండవ ఆదివారంలో ఈ మదర్స్ డే జరుపుకుంటారు. గత సంవత్సరం 2021లో మే 9న జరుపుకోగా ఈ సంవత్సరం మదర్స్ డే మే 8, 2022న జరుపుకోబోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో దీన్నే పాటిస్తూ మదర్స్ డే జరుపుకుంటారు. 1908లో USలో మొదటిసారిగా మదర్స్ డే జరుపుకున్నారు.

అన్నా జార్విస్ అనే ఓ మహిళ తన తల్లిని గౌరవించడం కోసం ఈ రోజును జరుపుకుంది. తన తల్లి ఆన్ రీస్ జార్విస్ సమాజంలో శాంతికోసం పాటుపడే ఓ సోషల్ యాక్టివిష్ట్. ప్రపంచంలో అందరికంటే మనకోసం ఎక్కువగా కష్టపడేది, మనల్ని ఎక్కువగా ప్రేమించేది తల్లే అని నమ్మి ఆమెని గౌరవించడానికి ఒక రోజుని పెట్టుకుంది. అప్పట్నుంచి ప్రతి సంవత్సరం మే రెండవ ఆదివారం మదర్స్ డేగా ప్రపంచంలోని చాలా దేశాలు జరుపుకుంటున్నాయి. ఒక తల్లి తన బిడ్డలకోసం చేసేదానికి ఒక రోజు మదర్స్ డేగా పెట్టుకొని ఆమెని గౌరవించినా అది తక్కువే. జీవితం చివరి దశలో ఆమెకు తోడుండి మంచిగా చూసుకుంటే చాలు. అంతకంటే ఎక్కువగా ఏమి చేయక్కర్లేదు, మన తల్లి కూడా ఏమి కోరుకోదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి