iDreamPost

Chiranjeevi: గుడ్ న్యూస్.. మెగాస్టార్ చిరంజీవిని వరించిన పద్మవిభూషణ్

తెలుగు సినీ అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవిని పద్మవిభూషణ్ అవార్డు వరించింది.

తెలుగు సినీ అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవిని పద్మవిభూషణ్ అవార్డు వరించింది.

Chiranjeevi: గుడ్ న్యూస్.. మెగాస్టార్ చిరంజీవిని వరించిన పద్మవిభూషణ్

ఏటా రిపబ్లిక్ డేకి ముందురోజు పద్మ పురస్కారాలను ప్రకటిస్తూ ఉంటారు. ఈ ఏడాది కూడా పద్మ పురస్కారాలకు ఎంపికైన వారి పేర్లను ప్రకటించారు. ఈసారి అవార్డుల ప్రకటన తెలుగు సినిమా ప్రేక్షకులకు అత్యంత ప్రత్యేకంగా మారాయి. ఎందుకంటే ఈ ఏడాది పద్మ పురస్కారాల్లో టాలీవుడ్ మెగాస్టార్ కు దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ దక్కింది. నిన్నటి వరకు ఉన్న వార్తలు, ఊహాగానాలను నిజం చేస్తూ.. కేంద్రం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో చిరంజీవి పేరును చూడగానే మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

మెగాస్టార్ చిరంజీవికి తెలుగురాష్ట్రాల్లో విశేష అభిమాన గణం ఉంది. 150కి పైగా చిత్రాలతో అభిమానులను ఎంతాగానో అలరించారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలను కొనియాడుతూ 2006లోనే భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ పేరిట ఆయన అందించిన సేవలను ప్రశంసిస్తూ పద్మభూషణ్ తో సత్కరించారు. ఇటీవల కరోనా సమయంలో చిరంజీవి అందించిన సేవల గురించి అందరికీ తెలిసిందే. కరోనా క్రైసిస్ ఛారిటీ అంటూ ట్రస్టును స్థాపించి.. సినిమా కళాకారులు, విలేకరులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. అంతేకాకుండా ఆక్సిజన్ సిలిండర్లు, అంబులెన్స్ సేవలను కూడా అందించారు. ఇప్పుడు ఈ సేవలను గుర్తిస్తూ మోదీ సర్కార్ మెగాస్టార్ చిరంజీవిని పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరిస్తోంది. చిరంజీవితో పాటుగా వెంకయ్యనాయుడు, వైజయంతిమాలకు పద్మ విభూషణ్ అవార్డులు దక్కాయి. చిరంజీవికి పద్మవిభూషణ్ దక్కడంతో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. మరి.. చిరంజీవికి పద్మవిభూషణ్ దక్కడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి