iDreamPost

భర్త నుంచి విడాకులు.. రూ. 4 లక్షలతో పార్టీ చేసుకున్న మోడల్

ప్రస్తుత సమాజంలో భార్యాభర్తల మధ్య సఖ్యత లేకుండా పోతోంది. చిన్న చిన్న కారణాలతో గొడవలు పడి ఊహించన నిర్ణయాలు తీసుకుంటున్నారు. నూరేళ్లు కలిసి జీవించాల్సిన వారు పెళ్లైన కొన్నాళ్లకే విడిపోతున్నారు. దీనికి గల కారణాలు అనేకం.

ప్రస్తుత సమాజంలో భార్యాభర్తల మధ్య సఖ్యత లేకుండా పోతోంది. చిన్న చిన్న కారణాలతో గొడవలు పడి ఊహించన నిర్ణయాలు తీసుకుంటున్నారు. నూరేళ్లు కలిసి జీవించాల్సిన వారు పెళ్లైన కొన్నాళ్లకే విడిపోతున్నారు. దీనికి గల కారణాలు అనేకం.

భర్త నుంచి విడాకులు.. రూ. 4 లక్షలతో పార్టీ చేసుకున్న మోడల్

ప్రస్తుత సమాజంలో భార్యాభర్తల మధ్య సఖ్యత లేకుండా పోతోంది. చిన్న చిన్న కారణాలతో గొడవలు పడి ఊహించన నిర్ణయాలు తీసుకుంటున్నారు. నూరేళ్లు కలిసి జీవించాల్సిన వారు పెళ్లైన కొన్నాళ్లకే విడిపోతున్నారు. దీనికి గల కారణాలు అనేకం. ఒకరిపై ఒకరికి ప్రేమ తగ్గటం, అభిప్రాయ బేధాలు, ఆర్థిక పరిస్థితులు కూడా కారణమవుతున్నాయి. ముఖ్యంగా పలు రంగాలకు చెందిన ప్రముఖులు డివోర్స్ తీసుకుంటున్న వారిలో ఎక్కువగా ఉంటున్నారు. ఇదే విధంగా ఓ మోడల్ తన భర్త నుంచి విడాకులు పొందింది. ఆ తర్వాత రూ. 4 లక్షలతో గ్రాండ్ గా పార్టీ చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

బ్రెజిల్ కు చెందిన లారిస్సా సంపానీ మోడల్. ఇన్‌స్టాగ్రామ్‌లో 4 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె తన దైనందిన జీవితానికి సంబంధించిన విషయాలను తరచుగా సోషల్ మీడియాలో పంచుకుంటుంది. అక్టోబర్ 31న సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసి తన భర్తకు విడాకులు ఇచ్చినట్లు చెప్పింది. వివాహం అయిన 6 నెలల తర్వాత ఆమె తన భర్తకు విడాకులు ఇచ్చినట్లు అక్కడి స్థానిక వార్తా పత్రికలు వెల్లడించాయి.

విడాకులకు కారణం ఆమెకి అమ్మాయిలతో పాటు అబ్బాయిలంటే ఇష్టం, అది తన భర్తకు నచ్చలేదని ఆ కారణంగానే విడాకులు ఇచ్చినట్లు తెలుస్తోంది. రియో డి జెనీరోలోని లారిస్సా స్నేహితురాలి ఇంట్లో ఈ విడాకుల పార్టీ జరిగింది. రూ. 4 లక్షలతో పార్టీ చేసుకుంది. ఆమె 10 మంది ప్రాణ స్నేహితులను మాత్రమే పార్టీకి ఆహ్వానించినట్లు తెలిపింది. విడాకుల పార్టీకి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా లారిస్సా సంపానీ పంచుకుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి