iDreamPost

హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్‌.. రూ.5 టిక్కెట్‌తో 22 కిమీలు హైస్పీడ్ జర్నీ

  • Published Feb 12, 2024 | 11:28 AMUpdated Feb 12, 2024 | 11:28 AM

MMTS Trains:ట్రాఫిక్‌ సమస్యలు, ప్రయాణ ఛార్జీలతో ఇబ్బంది పడుతున్న నగరవాసులకు గుడ్‌ న్యూస్‌.. 22 కిమీల జర్నీకి కేవలం 5 రూపాయలు మాత్రమే. ఆ వివరాలు..

MMTS Trains:ట్రాఫిక్‌ సమస్యలు, ప్రయాణ ఛార్జీలతో ఇబ్బంది పడుతున్న నగరవాసులకు గుడ్‌ న్యూస్‌.. 22 కిమీల జర్నీకి కేవలం 5 రూపాయలు మాత్రమే. ఆ వివరాలు..

  • Published Feb 12, 2024 | 11:28 AMUpdated Feb 12, 2024 | 11:28 AM
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్‌.. రూ.5 టిక్కెట్‌తో 22 కిమీలు హైస్పీడ్ జర్నీ

హైదరాబాద్‌ నగరవాసులకు మెట్రో కన్నా ముందు నుంచి సేవలు అందిస్తూ వస్తోంది ఎంఎంటీఎస్‌. మెట్రోలు అందుబాటులోకి వచ్చినా.. ఎంఎంటీఎస్‌ జర్నీకి డిమాండ్‌ తగ్గడం లేదు. మెట్రోలేని ప్రాంతాల్లో ఎంఎంటీఎస్‌లు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. పైగా మెట్రోతో పోలిస్తే.. వీటి ఛార్జీలు చాలా తక్కువ. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు, ఐటీ ఎంప్లాయిస్‌, విద్యార్థులు, కూలీలు ఇలాం చాలా మంది నిత్యం ఎంఎంటీఎస్‌లలో ప్రయాణిస్తుంటారు. అయితే ఇవి ఎక్కువగా లేవు. ఈ క్రమంలో తాజాగా రక్షణ-రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

ఎంఎంటీఎస్‌ రెండో దశ పనులు ఇప్పటికే మొత్తం పూర్తి కాగా.. సనత్‌నగర్‌-మౌలాలి మధ్య ఎంఎంటీఎస్‌ రెండో లైను రెడీ అయింది. రక్షణశాఖ – రైల్వే శాఖల మధ్య రెండో లైను నిర్మాణానికి ఉన్న ఆటంకాలు తొలగడంతో పనులు వేగంగా పూర్తయ్యాయి. రెండో దశలో భాగంగా మొత్తం 95 కిలోమీటర్ల మేర లైన్లు వేయడం, విద్యుదీకరణ, స్టేషన్ల నిర్మాణం వంటి పనులు పూర్తి చేశారు. వచ్చే నెల అనగా మార్చిలోనే దీన్ని ప్రారంభించనున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ చర్లపల్లి రైల్వే స్టేషన్‌ ప్రారంభోత్సవానికి గాను మార్చి మొదటి వారంలో హైదరాబాద్‌ రానున్న సంగతి తెలిసిందే. అదే రోజు సనత్‌నగర్‌-మౌలాలి మధ్య మొత్తం 22 కిలోమీటర్ల మేర రెండో దశ ఎంఎంటీఎస్‌ ట్రైన్లను కూడా మోదీ ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్‌-ఘట్‌కేసర్‌ లైన్‌ కూడా అదేరోజు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. చర్లపల్లి స్టేషన్‌ ప్రారంభమయ్యాక అక్కడి నుంచి 25 ప్యాసింజర్ ట్రైన్లు దూరప్రాంతాలకు రాకపోకలు సాగించనున్నాయి. ఈ ట్రైన్లకు ప్రయాణికులను చేరవేయాలన్నా.. ఆయా స్టేషన్లలో దిగినవారిని నగరానికి తీసుకురావాలన్నా.. ఎంఎంటీఎస్‌లు కీలకం కానున్నాయి. సనత్‌నగర్‌-మౌలాలి లైనుతోనే ఇది సాధ్యమవుతుందని రైల్వే అధికారులు అంటున్నారు.

ఎంఎంటీఎస్‌ రెండో దశ మౌలాలి-సనత్‌నగర్‌, హైటెక్‌సిటీ మీదుగా లింగంపల్లి లైన్‌ అందుబాటులోకి రానుంది. దాంతో ఈ రూట్లలో ప్రయాణాలు సాగించే ఐటీ ఉద్యోగులు వేగంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. అత్యంత రద్దీగా మారిన సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌తో సంబంధం లేకుండా నేరుగా మౌలాలి నుంచి హైటెక్‌సిటీకి ఎంఎంటీఎస్‌లు అందుబాటులోకి రానున్నాయి. మౌలాలి-సనత్‌నగర్‌ మధ్య మొత్తం 22 కి.మీ. మేర 6 స్టేషన్లు అదనంగా అందుబాటులోకి రానున్నాయి. వీటి పరిధిలో ఉన్న కాలనీలు, బస్తీలకు కేవలం రూ. 5 టిక్కెట్‌తో హై స్పీడ్ జర్నీ అందుబాటులోకి రానుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి