iDreamPost

టీమ్ లో వద్దని పక్కన పెట్టారు! కానీ.., ఈ వరల్డ్ కప్ కి అతనే కీలకం!

టీమ్ లో వద్దని పక్కన పెట్టారు! కానీ.., ఈ వరల్డ్ కప్ కి అతనే కీలకం!

ఆస్ట్రేలియా టూర్ ఆఫ్ సౌత్ ఆఫ్రికాలో ఆసీస్ జట్టు శుభారంభం చేసింది. 3 టీ20లు, 5 వన్డే మ్యాచుల కోసం ఆస్ట్రేలియా జట్టు సౌత్ ఆఫ్రికా వెళ్లింది. తొలి టీ20లో కంగారులు ప్రొటీస్ జట్టుపై అద్భుతమైన విజయాన్ని నమోదు చేశారు. 111 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా గెలిచింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది కెప్టెన్ మిచెల్ మార్ష్. అతను కెప్టెన్ గా ముందుండి ఈ విజయాన్ని జట్టుకు అందించాడు. ఇప్పుడు అందరూ మిచెల్ మార్ష్ ను పొగిడేస్తున్నారు. కానీ, రెండేళ్ల క్రితం జట్టుకు అవసరం లేదంటూ పక్కన పెట్టేశారు. అతనే ఇప్పుడు ఆస్ట్రేలియాకి వరల్డ్ కప్ తెచ్చే హీరో అని చెబుతున్నారు.

ఎవరి కెరీర్లో అయినా ఒడిదొడుకులు సహజమే. ఎల్లప్పుడూ అదే ఫామ్ కంటిన్యూ చేయడం అందరికీ సాధ్యం కాదు. అలాగే మిచెస్ మార్ష్ కూడా తన ఫామ్ ని కొనసాగించలేకపోయాడు. ఇదే సౌత్ ఆఫ్రికాపై మిచెల్ మార్ష్ 2011 అక్టోబర్ లో టీ20, వన్డే మ్యాచ్ లలో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా జట్టులో మార్ష్ ఎంతో కీలక ఆల్ రౌండర్ గా మారిపోయాడు. సాధారణంగానే మిచెల్ మార్ష్ ఎంతో దూకుడుగా ఆడేవాడు. అటు బ్యాటుతో ఇటు బాల్ తోనే కాకుండా.. ఫీల్డింగ్ లో కూడా ఎంతో చురుకుగా ఉండేవాడు. టెస్టులు, వన్డేల్లో ఐదేసి వికెట్లు తీసిన రికార్డు మిచెల్ మార్ష్ సొంతం. అంటే రెగ్యులర్ బాలర్ కు ఏమాత్రం తీసిపోకుండా మిచెల్ మార్ష్ పర్ఫార్మ్ చేశాడు. కానీ, తర్వాత మెల్లిగా మిచెల్ మార్ష్ గాడి తప్పాడు. ఆస్ట్రేలియా కూడా మార్ష్ ను పక్కన పెట్టేసింది.

అక్కడితోనే మిచెల్ మార్ష్ నిరాశ చెందలేదు. తిరిగి పోరాటం ప్రారంభించాడు. ఎట్టకేలకు మళ్లీ జట్టులో స్థానం సంపాదించాడు. ఇప్పుడు టీ20 జట్టు కెప్టెన్ గా మిచెల్ మార్ష్ ఆస్ట్రేలియాకి ఎంతో కీలకంగా మారిపోయాడు. తనదైన శైలిలో దూకుడుగా ఆడుతూ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. అటు టీ20కి మాత్రమే కాకుండా వన్డేల్లో కూడా తన సత్తా చాటుతున్నాడు. ఇప్పుడు ఆస్ట్రేలియాకి వన్డే వరల్డ్ కప్ కోసం మిచెల్ మార్ష్ ప్రధానమైన ఆటగాడిగా మారడమే కాదు.. వరల్డ్ కప్ తెచ్చే హీరోగా భావిస్తున్నారు. అవమానాలు ఎదుర్కొన్న దగ్గరే మిచెల్ మార్ష్ హీరోగా నిలిబడ్డాడు అంటూ క్రికెట్ ఫ్యాన్స్ మెచ్చుకుంటున్నారు. బుధవారం సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో మిచెల్ మార్ష్ ప్రదర్శన చూస్తే.. 49 బంతుల్లోనే 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 92 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. కేవలం 22 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేశాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి