iDreamPost

ముంబయి గ్రేట్ కంబ్యాక్.. ఆఖరి ఓవర్లో షెపర్డ్ సునామీ ఇన్నింగ్స్..

MI vs DC- Romario Shepherd: ముంబయి జట్టు తొలి విజయానికి అడుగు దూరంలో ఉంది. వాంఖడే స్టేడియం వేదికగా పరుగుల వరద పారించారు. ముఖ్యంగా షెపర్ట్ ఆఖరి ఓవర్లో సునామీ ఇన్నింగ్స్ తో చెలరేగాడు.

MI vs DC- Romario Shepherd: ముంబయి జట్టు తొలి విజయానికి అడుగు దూరంలో ఉంది. వాంఖడే స్టేడియం వేదికగా పరుగుల వరద పారించారు. ముఖ్యంగా షెపర్ట్ ఆఖరి ఓవర్లో సునామీ ఇన్నింగ్స్ తో చెలరేగాడు.

ముంబయి గ్రేట్ కంబ్యాక్.. ఆఖరి ఓవర్లో షెపర్డ్ సునామీ ఇన్నింగ్స్..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ముంబయి ఇండియన్స్ ఖాతా తెరిచే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాంఖడే వేదికగా ముంబయి జట్టు ఐపీఎల్ 2024 సీజన్లో తొలి విజయం నమోదు చేసే దాఖలాలు కనిపిస్తున్నాయి. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ జట్టు ముంబయి బ్యాటర్లను కట్టడి చేయలేకపోయింది. మొదటి ఓవర్లలో పరుగలు వరద పారింది. ముఖ్యంగా ఇషాన్ కిషన్- రోహిత్ శర్మ జోడీ వాంఖడేలో పరుగుల సునామీ సృష్టించారు. 10 ఓవర్లలోపే టీమ్ స్కోర్ ని వంద దాటించేశారు. అయితే ఆ తర్వాత రోహిత్, ఇషాన్ అవుటవ్వడంతో ఆట మందగించింది. టీమ్ స్కోర్ 200 దాటడం కూడా కష్టం అనేలా కనిపించింది. కానీ, ఆఖరి ఓవర్లో షెపర్డ్ విజృంభించాడు.

వాంఖడే వేదికగా ముంబయి జట్టు అద్భుతమైన ఇన్నింగ్స్ నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఏకంగా 234 పరుగులు చేసింది. తొలుత టీమ్ ని ముందుండి నడిపించిన ఇషాన్- రోహిత్ అవుటయ్యాక ముంబయి కష్టాల్లో పడిపోయింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న సూర్య కుమార్ యాదవ్ డకౌట్ అయ్యాడు. తిలక్ వర్మ కేవలం 6 పరుగులతో సరిపెట్టుకున్నాడు. హార్దిక్ పాండ్యా కాసేపు ఆడినా.. స్లో బ్యాటింగ్ తో ఇబ్బంది పడ్డాడు. ఇలాంటి తరుణంలో ముంబయి జట్టు స్కోర్ 200 దాటడం కూడా గగనం అనుకున్నారు. కేవలం 180 పరుగులు చేస్తుంది అనుకున్నారు. కానీ, టిమ్ డేవిడ్ వచ్చాక స్కోర్ బోర్డు జోరందుకుంది. ఆ తర్వాత హార్దిక్ అవుటయ్యాక షెపర్డ్ మైదానంలోకి రావడంతో పరుగుల సునామీ వచ్చినట్లు అయ్యింది.

ఈ ఇన్నింగ్స్ మొత్తం ఒకెత్తు అయితే ఆఖరి ఓవర్లో షెపర్డ్ చేసిన విధ్వంసం ఒకెత్తు అని చెప్పారు. నోర్ట్జేని మొదటి బంతి నుంచి ఉతికి ఆరేశాడు. లాస్ట్ ఓవర్ తొలి బంతికే ఫోర్ బాది నోర్ట్జేకి హెచ్చరికలు జారీ చేశాడు. ఆ తర్వాత రెండో బంతిని సిక్సర్ భారీ సిక్సర్ గా మలిచాడు. ఆ తర్వాత 3, 4 బంతులను కూడా భారీ సిక్సర్స్ గా మలిచాడు. ఇంకేముందు మైదానంలో ముంబయి ఫ్యాన్స్ కి సంబరాలు అంబరాన్ని అంటాయి. అక్కడితే షెపర్డ్ ఆగుతాడు అనుకున్నారు. కానీ, అతని విధ్వంసం అక్కడితో ఆగలేదు. ఆఖరి రెండు బంతులను ఫోర్, సిక్సర్ గా మలిచి ముంబయి జట్టు స్కోర్ 234కి చేరేలా చేశాడు. ఇంకేముంది 200 కూడా దాటదు అనుకున్న స్కోర్ ఏకంగా 234కు చేరింది.

రోమారియో షెపర్డ్ ఎదుర్కొన్న 10 బంతుల్లోనే ఏకంగా 39 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరోవైపు టిమ్ డేవిడ్(45*) కూడా తన దూకుడు ఆటతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ(49) ఒక్క పరుగుతో అర్ధ శతకాన్ని మిస్ చేసుకున్నాడు. ఇషాన్ కిషన్(42) కూడా అర్ధ శతకాన్ని మిస్ అయ్యాడు. హార్దిక్ పాండ్యా(39) పరుగులతో పర్వాలేదు అనిపించాడు. స్కై, తిలక్ వర్మ మాత్రం ఈ మ్యాచ్ లో నిరాశ పరిచారు. ఢిల్లీ బౌలింగ్ చూస్తే.. అక్షర్ పటేల్, నోర్ట్జేకి చెరో 2 వికెట్లు దక్కాయి. ఖలీల్ అహ్మద్ కు ఒక వికెట్ దక్కింది. మరి.. ఆఖరి ఓవర్లో రొమారియో షెపర్డ్ చేసిన విధ్వంసంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి