iDreamPost

ఆంధ్రప్రదేశ్‌కి వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు!

  • Published Jan 06, 2024 | 12:50 PMUpdated Jan 06, 2024 | 12:50 PM

గత కొన్నిరోజులుగా ఏపీ, తమిళనాడులో తుఫాన్లు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇటీవల మిచౌంగ్ తుఫాన్ తో ఏపీలో తీవ్ర నష్టం వాటిల్లింది. ఇక చెన్నై అయితే అతలాకుతలం అయ్యింది.

గత కొన్నిరోజులుగా ఏపీ, తమిళనాడులో తుఫాన్లు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇటీవల మిచౌంగ్ తుఫాన్ తో ఏపీలో తీవ్ర నష్టం వాటిల్లింది. ఇక చెన్నై అయితే అతలాకుతలం అయ్యింది.

  • Published Jan 06, 2024 | 12:50 PMUpdated Jan 06, 2024 | 12:50 PM
ఆంధ్రప్రదేశ్‌కి వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు!

ఇటీవల ఏపీలో భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. మరోసారి ఏపిలో వర్షాలు పడతాయని అంచనా వేస్తుంది వాతావరణ శాఖ. దక్షిణ శ్రీలంక నుంచి నైరుతి బంగాళా ఖాతం మీదుగా ద్రోణి కొనసాగుతుంది. సముద్ర మట్టంపై 1.5 మీటర్ల ఎత్తులో ఆవర్తనం కొనసాగుతుందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావం ఎక్కువగా తమిళనాడు, రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలో ఉంటుందని.. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇటీవల కురిసిన వర్షాల బాధ నుంచి ప్రజలు ఇంకా కోలుకోలేదు.. దానికి తోడు విపరీతమైన చలితో గజ గజలాడిపోతున్నారు ఏపీ ప్రజలు. దీనికి తోడు ఇప్పడు వర్ష సూచనతో ఆందోళనకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళితే..

ఆంధ్రప్రదేశ్ లో మరోసారి భారీ వర్షాలు పడే సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. దక్షిణ శ్రీలంక నుంచి నైరుతి బాగాళాఖాతం మీదుగా ఏర్పడిన దోణి ప్రభావం తమిళనాడు, ఏపీలో పడుతుందని ఐఎండీ పేర్కొంది. దీని ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, కడప జిల్లాల్లో వాతావరణం మార్పులు వచ్చాయి.. ఆకాశం మేఘావృతమై ఉంది. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే చూచన కనిపిస్తుంది. రెండు నెలల క్రితం మిచౌంగ్ తుఫాన్ ధాటికి ఏపీ భితిల్లిపోయింది. ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు ఇంకా ఆ బాధ నుంచి కోలుకోలేదు. సీఎం జగన్ మిచౌంగ్ తుఫాన్ వల్ల ఎఫెక్ట్ అయిన బాధితులను స్వయంగా కలిసి వారిని పరామర్శించి సహాయం అందించారు.

ఇదిలా ఉంటే ఇటీవల మిచౌంగ్ తుఫాన్ వల్ల తమిళనాడు రాష్ట్రం కుదేలైంది. చెన్నైలో భారీ వర్షాల కారణంగా తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లింది. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో తుఫాన్ ఛాయలు కనిపిస్తూనే ఉన్నాయి. లక్ష ద్వీప్ పైన తుఫాన్ తరహా వాతావరణం కొనసాగుతుందని.. ఇది కేరళ వైపు కదులుతుందని.. దీని ప్రభావం తో నాలుగు రోజుల పాటు కేరళ, తమిళనాడు, లక్ష్మద్విప్ లో తెలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని.. వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్ష సూచనతో తమిళనాడు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఈసారి ఆ స్థాయి ముంపు వాటిల్లే అవకాశం లేదని అంటున్నారు ఐఎండీ అధికారులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి