iDreamPost

మీమ్స్ లో కనిపించే ‘చింటూ డాగ్’ బ్రీడ్ ఏంటో? దాని రేటెంతో తెలుసా?

Chimtu Dog: సోషల్ మీడియాలో కనిపించే చింటూ డాగ్ చనిపోయింది. ఇన్నాళ్లు కామెడీ ఫేస్ తో నవ్వించిన చింటూ అరుదైన వ్యాధితో బాధపడుతూ ఇవాళ కన్ను మూసింది.

Chimtu Dog: సోషల్ మీడియాలో కనిపించే చింటూ డాగ్ చనిపోయింది. ఇన్నాళ్లు కామెడీ ఫేస్ తో నవ్వించిన చింటూ అరుదైన వ్యాధితో బాధపడుతూ ఇవాళ కన్ను మూసింది.

మీమ్స్ లో కనిపించే ‘చింటూ డాగ్’ బ్రీడ్ ఏంటో? దాని రేటెంతో తెలుసా?

సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్ ఎంతగానో నవ్విస్తాయి. ఎక్కువగా బ్రహ్మానందం, సునీల్ వంటి కమెడియన్ల ఫోటోలతో మీమ్స్ వస్తుంటాయి. అయితే మనుషులతో పాటు జంతువుల బొమ్మలతో కూడా అనేక మీమ్స్ వస్తున్నాయి. వాటిలో చింటూ డాగ్ ఒకటి. చింటూ డాగ్ మీమ్స్ బాగా వైరల్ అవుతుంటాయి. ఈ డాగ్ ఫోటోతో అనేక ఫేస్ బుక్ పేజీలు, ట్రోల్ పేజీలు, మీమ్ పేజీలు, ఇన్స్టాగ్రామ్ ఖాతాలు వందల సంఖ్యలో ఉన్నాయి. భారతీయులకు ఇది చింటూ డాగ్ గానే తెలుసు. కానీ దీని అసలు పేరు కబోసు. ఇది జపాన్ దేశానికి చెందిన కుక్క. మీమ్ ప్రపంచంలో ఒక సంచలనం సృష్టించింది. ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఈ డాగ్ మీమ్స్ ని చూస్తే క్షణాల్లో టెన్షన్స్ అన్నీ ఎగిరిపోతాయి. అంతగా ఈ కుక్క ముఖం నవ్వు తెప్పిస్తుంది. చాలా అంటే చాలా ఫన్నీగా ఉంటుంది. అయితే ఇన్నాళ్లూ మన అందరి సంతోషానికి కారణమైన చింటూ డాగ్ కన్ను మూసింది. గత కొన్ని రోజులుగా లుకేమియాతో బాధపడుతున్న కబోసు మే 24న మరణించింది. ఈ విషయాన్ని డాగీ కాయిన్ క్రిప్టో కరెన్సీ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది.

‘మా కమ్యూనిటీ పార్టనర్, ఫ్రెండ్ అయిన కబోసు ప్రశాంతంగా కన్ను మూసింది. అపరిమితమైన ప్రేమకు, సంతోషానికి చిరునామా అయిన ఈ కబోసు మీమ్ ప్రపంచంలో చెరగని ముద్ర వేసింది. అది ఎప్పటికీ మనందరి గుండెల్లో నిలిచిపోతుంది’ అంటూ పోస్ట్ చేసింది. 2010 నుంచి కబోసు డాగ్ కి సంబంధించిన ఫోటోలు ఆన్ లైన్ లో వైరల్ అవుతున్నాయి. 2013లో క్రిప్టోకరెన్సీ డాగీ కాయిన్ స్టార్ట్ చేసినప్పుడు కబోసు డాగ్ ని ప్రొఫైల్ పిక్ గా పెట్టుకుంది. దీంతో ఈ డాగ్ మరింత పాపులర్ అయ్యింది. గత ఏడాది ఏప్రిల్ నెలలో ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్ లోగోగా కబోసు కుక్క ఫోటోను ఉంచారు. ఈ కారణంగా డాగీ కాయిన్ క్రిప్టోకరెన్సీ విలువ మరింత పెరిగింది. విదేశాల్లో దీని పేరు కబోసు అయినా మనకి మాత్రం చింటూగానే పరిచయం అయ్యింది.

ఈ కుక్క ఫోటోతో ఎన్ని వేల మీమ్స్ వచ్చాయో. ఇప్పటికీ వస్తున్నాయి కూడా. క్రికెట్, సినిమా, పాలిటిక్స్, బయట జరిగే అంశాల మీద ఫన్నీ మీమ్స్ వేస్తుంటారు. సెటైరికల్ మీమ్స్ కూడా వేస్తుంటారు. ముఖ్యంగా లవర్స్ మీద, తప్పు చేసి దొరికిపోయి వాళ్ళ మీద వేసే మీమ్స్ ఓ రేంజ్ లో పేలతాయి. అందులో ఈ డాగ్ ఫేస్ చూస్తే విపరీతంగా నవ్వు వస్తుంది. అలాంటి చింటూ డాగ్ 18 ఏళ్ల వయసులో చనిపోయింది. ఇది షిబా ఇను జాతికి చెందిన కుక్క. ఈ కుక్క జీవిత కాలం 12 నుంచి 15 ఏళ్ళు. అయితే చింటూగా పరిచయమైన కబోసు మాత్రం 18 ఏళ్ళు బతికింది. ఈ కుక్క పిల్ల విలువ 40 వేల నుంచి 60 వేల రూపాయల వరకూ ఉంటుంది. అంతకంటే ఎక్కువ కూడా ఉండచ్చు. ఎందుకంటే దాని ఆరోగ్యం, పెడిగ్రీ, జాతికి ఉండే ప్రతిష్ట వంటి వాటి వల్ల ధర ఎక్కువగానే ఉంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి