iDreamPost

మెగాస్టార్ ని వదలని రీమేక్ ఫీవర్

మెగాస్టార్ ని వదలని రీమేక్ ఫీవర్

ప్రస్తుతం ఆచార్య షూటింగ్ నుంచి కరోనా వల్ల బ్రేక్ తీసుకుని క్రైసిస్ చారిటీ నిధుల సమీకరణలో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి దీని తర్వాత ఏ సినిమా చేస్తారనే దాని గురించి ఎడతెగని ఊహాగానాలు సాగుతూనే ఉన్నాయి. మెగా కాంపౌండ్ నుంచి వస్తున్న విశ్వసనీయ సమాచారం మేరకు రామ్ చరణ్ గత ఏడాది కొన్న లూసిఫర్ రీమేక్ హక్కుల తాలూకు పనులను బ్యాక్ గ్రౌండ్ లో చేయిస్తున్నారట. అయితే దర్శకుడు ఎవరనే విషయం మాత్రం బయటికి రావడం లేదు. వివి వినాయక్, హరీష్ శంకర్, సుజిత్ ఇలా ఏవేవో పేర్లు వినిపిస్తున్నాయి కానీ ఖచ్చితంగా ఎవరు హ్యాండిల్ చేస్తారనే క్లారిటీ మాత్రం తెలియడం లేదు.

ఇదిలా ఉండగా లూసిఫర్ తెలుగులో ఎప్పుడో డబ్ అయ్యింది. కాకపోతే థియేటర్లలో ఆడలేదు. అమెజాన్ ప్రైమ్ లో పెట్టారు. కొన్ని లక్షల మంది ఈ పాటికి చూసేసి ఉంటారు. శాటిలైట్ టెలికాస్ట్ కాకుండా మాత్రమే నిర్మాతలు ఆపగలిగారు. మరి ఇందరు చూసేసిన సినిమాను రీమేక్ ఆలోచన చేయడం కరెక్టేనా అనే కామెంట్స్ కూడా వినపడుతున్నాయి. లూసిఫర్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సాగే క్రైమ్ థ్రిల్లర్. బోలెడు హీరోయిజం కూడా ఉంటుంది. కాకపోతే హీరో పాత్ర పాలిటిక్స్ లో ఉండదు. వెనుక నుంచి నడిపిస్తూ ఉంటుంది. రాజకీయ జీవితానికి స్వస్తి పలికిన చిరు ఇలాంటి కథలో నటిస్తే ఎలా అనే కోణంలో కొన్ని విశ్లేషణలు జరుగుతున్నాయి.

మొత్తానికి లూసిఫర్ మీద చిరంజీవి అంత ఈజీగా ఆసక్తిని చంపుకునే ఉద్దేశంలో లేరని తెలిసింది. పైగా ఇందులో సెకండ్ హాఫ్ లో ఎంటరయ్యే ఓ యంగ్ హీరో పాత్ర ఉంది. దాన్ని రామ్ చరణ్ తో చేయిస్తే ఎలా ఉంటుందనే డిస్కషన్ కూడా జరుగుతోందని వినికిడి. ఇంత కసరత్తు చేసే బదులు ఏదైనా కొత్త కథతో వెళ్తే బెటరే కానీ అంత డబ్బు పెట్టి కొన్ని రీమేక్ రైట్స్ ని ఊరికే వదలడం కూడా భావ్యం కాదేమో. ఇప్పుడీ ఫ్రీ టైంని చిరు దీని కోసమే వాడుతున్నట్టు చెబుతున్నారు. ఆచార్య షూటింగ్ మళ్ళీ మొదలయ్యాక సమయం ఉండదు కాబట్టి ఆ లోగానే దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకోవాలి. సో లూసిఫర్ చేస్తారా చేయరా అనే సస్పెన్స్ వీడడానికి ఇంకాస్త టైం అయితే పడుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి