iDreamPost

సోషల్ మీడియాలో ‘మెగా’ ఎంట్రీ

సోషల్ మీడియాలో ‘మెగా’ ఎంట్రీ

ప్రస్తుతం అంతా సోషల్ మీడియా మయమైపోయిన తరుణంలో ఇప్పుడు టాలీవుడ్ కు పెద్ద దిక్కుగా భావిస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఆ ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నారు. దీనికి ముహూర్తంగా రేపే అంటే ఉగాది పండుగను ఎంచుకున్నారు. అయితే ఫేస్ బుక్, ఇన్స్ టాగ్రామ్, ట్విట్టర్ ఇలా దేనిలో ఒకదానికే వస్తారా లేదా అన్నింట్లో యాక్టివ్ గా ఉంటారా అనే విషయం ఇంకా తెలియదు. నిజానికి చిరంజీవి పేరు మీద ఇప్పటికే కొన్ని ఫేక్ ఐడిస్ ఉన్నాయి. అవి అబద్దమని తెలియక ఫాలో అవుతున్న మిలియన్ల ఫాలోయర్స్ కూడా ఉన్నారు.

దీంతో చిరు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. రామ్ చరణ్ స్వంత నిర్మాణ సంస్థ కొణిదెల అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ లో వీడియో రూపంలో దీన్ని ప్రకటించడం విశేషం. అయితే కరోనా భయంతో ప్రపంచం వణుకుతున్న వేళ చిరు ఇలా ఎంట్రీ ఇవ్వడం కరెక్టా అనే కామెంట్స్ రావొచ్చేమో కాని కొద్దిరోజులు ఆయనైనా దాని గురించిన నాలుగు మంచి మాటలు సలహాలు తప్ప ఇంకేమి ఇవ్వగలరు. నిజానికి ఆచార్య ఫస్ట్ లుక్ ని ఉగాది గిఫ్ట్ గా మార్చ్ 25ని లాక్ చేసుకున్నారు.

కాని అనూహ్యంగా వైరస్ పరిణామాలు చుట్టుముట్టడంతో రేపు ఆ రిలీజ్ ఉంటుందా లేదా అనే అనుమానం అయితే ఉంది. ఏది ఎలా ఉన్న తమ బాస్ సోషల్ మీడియా ఎంట్రీ పట్ల మెగా ఫాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. రామ్ చరణ్ ఫేస్ బుక్ లో ఉన్నప్పటికీ ఇంకా ట్విట్టర్ లో ఖాతా తీయలేదు. అభిమానులు డిమాండ్ చేసినా లైట్ తీసుకున్నాడు. మిగిలిన మెగా హీరోలందరికీ ఇందులో భారీ ఫాలోయింగ్ ఉంది. మరి చిరు త్రీ ఇన్ వన్ ప్యాకేజీలో వస్తాడా లేక కొడుకు బాటలో ఒకదానికే పరిమితమవుతారా చూడాలి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి