iDreamPost

హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేని ఇమేజ్​ మెగాస్టార్​ది: విజయ్ దేవరకొండ!

  • Author singhj Published - 08:48 AM, Tue - 22 August 23
  • Author singhj Published - 08:48 AM, Tue - 22 August 23
హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేని ఇమేజ్​ మెగాస్టార్​ది: విజయ్ దేవరకొండ!

నటనతో పాటు సేవా కార్యక్రమాలతో కోట్లాది మంది అభిమానుల మనసులు గెలుచుకున్న మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే ఇవాళ. దీంతో ఆయన పుట్టిన రోజు వేడుకల్ని ఫ్యాన్స్ ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. టాలీవుడ్​లో ఎంతో మంది హీరోలు ఉన్నారు. కానీ వారిలో చిరు విభిన్నం అనే చెప్పాలి. తెలుగునాట డ్యాన్సులు, ఫైట్లకు కొత్త అర్థం చెప్పింది చిరునే. కమర్షియల్ సినిమాల్లో అన్ని హంగులూ ఉండేలా చూసుకుంటూనే, మంచి సందేశాన్ని ఇవ్వొచ్చని ఆయన నిరూపించారు. టాలీవుడ్​లో ఎన్నో రికార్డులు ఆయన పేరు మీదే ఉన్నాయి. సరైన సినిమా పడితే మరిన్ని కొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఆయనకు పెద్ద పనేమీ కాదు. అలాంటి చిరు ఇటీవల ఘోర పరాజయాన్ని చూశారు.

మెగాస్టార్ నటించిన ‘భోళా శంకర్’ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్​గా నిలిచింది. చిరు కెరీర్​లోనే భారీ డిజాస్టర్స్​లో ఒకటిగా దీన్ని చెబుతున్నారు. ‘భోళా’ అంచనాలను అందుకోవడంలో విఫలమవ్వడంతో చిరు పనైపోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనికి రౌడీస్టార్ విజయ్ దేవరకొండ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘ఖుషి’ ప్రమోషన్స్​లో భాగంగా విజయ్ మాట్లాడుతూ చిరు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్​ను పొగడ్తల్లో ముంచెత్తిన రౌడీస్టార్.. ఆయన కమ్​బ్యాక్ ఇస్తే మామూలుగా ఉండదన్నారు. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేని ఇమేజ్ చిరంజీవిది అని విజయ్ పేర్కొన్నారు.

రజినీకాంత్, చిరంజీవి లాంటి స్టార్లకు హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేదు. రజినీకి 6 ఫ్లాపులు పడొచ్చు. కానీ ఆయన ‘జైలర్’తో వచ్చి ఏకంగా రూ.500 కోట్లు కొల్లగొట్టారు. చిరంజీవికి కూడా ఆరేడు ఫ్లాపులు రావొచ్చు. కానీ ఆయన కమ్​బ్యాక్ ఇస్తే వేరేలా ఉంటుంది. ఆయన ఎనర్జీని వాడుకునే సరైన దర్శకుడు దొరికితే అది తప్పక జరుగుతుంది. ఈ సంక్రాంతికి ఆయన పెద్ద హిట్ ఇచ్చారు. తెలుగు ఇండస్ట్రీలో అప్పటిదాకా ఉన్న యాక్టింగ్ స్టైల్, డ్యాన్స్​ను చిరు మార్చేశారు. ఇలాంటి హీరోలను సక్సెస్, ఫెయిల్యూర్స్​తో అంచనా వేయకూడదు. వాళ్లు అందరిలో స్ఫూర్తిని నింపుతారు. అలాంటి లెజెండ్స్​ను అందరూ గౌరవించాలి’ అని విజయ్ దేవరకొండ కోరారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి