iDreamPost

మెగాస్టార్ చిరంజీవికి సర్జరీ! ఆందోళనలో అభిమానులు!

  • Author ajaykrishna Published - 03:15 PM, Mon - 14 August 23
  • Author ajaykrishna Published - 03:15 PM, Mon - 14 August 23
మెగాస్టార్ చిరంజీవికి సర్జరీ! ఆందోళనలో అభిమానులు!

ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు సంబంధించి ఎప్పుడెప్పుడు అప్డేట్స్ బయటికి వస్తాయా అని వెయిట్ చేస్తుంటారు ఫ్యాన్స్. ఒక్కోసారి సినిమాల అప్డేట్స్ తెలిసినప్పటికి.. సెలబ్రిటీల పర్సనల్ హెల్త్ విషయాలు కూడా తెలుస్తుంటాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెగాస్టార్ త్వరలోనే మోకాలికి సర్జరీ చేయించుకోనున్నారని.. దానికోసం ఢిల్లీకి లేదా బెంగళూరుకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఆ సర్జరీ కూడా ఈ వారంలోనే జరగనుందని.. ఆ తర్వాత కొద్దిరోజులు విశ్రాంతి తీసుకుంటారని సదరు వార్తల సారాంశం. సుమారు నెలాఖరు వరకు చిరు విశ్రాంతి తీసుకుంటారని సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఇదిలా ఉండగా.. మెగాస్టార్ చిరు చాలా చురుకుగా సినిమా తర్వాత సినిమాలను లైనప్ చేస్తున్నారు. దీంతో గ్యాప్ లేకుండా అయిపోతుంది. అందుకే.. ఇలా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఇదిలా ఉండగా.. మెగాస్టార్ హెల్త్ కి సంబంధించి ఓవైపు అభిమానులు టెన్షన్ పడుతున్నారు. మోకాలి సర్జరీ అని తెలిసి.. వాస్తవానికి ఏమైందో తెలియక ఆందోళన చెందుతున్నారు ఫ్యాన్స్. మరి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలు నిజమేనా లేక అబద్ధాలా అనేది మెగా ఫ్యామిలీ నుండి క్లారిటీ రావాల్సి ఉంది. ఇక మెగాస్టార్ నటించిన లేటెస్ట్ మూవీ భోళా శంకర్ ప్రస్తుతం థియేటర్స్ లో రన్ అవుతోంది. మరి మెగాస్టార్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి